WPL GT Vs DC 2026: టి20 ఫార్మాట్లో.. ముఖ్యంగా ఐపీఎల్ లో పరుగుల వరద పారుతూ ఉంటుంది. ప్లేయర్లు అంతకుమించి అనే స్థాయిలో బ్యాటింగ్ చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో అసాధ్యాన్ని సైతం సు సాధ్యం చేసి సరికొత్త రికార్డులు సృష్టిస్తుంటారు.
2008లో మొదలైన ఐపిఎల్ ఇప్పటివరకు విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. ఆయా జట్ల తరఫున ఆడుతున్న ప్లేయర్లు సరికొత్త రికార్డులను సృష్టిస్తూనే ఉన్నారు. బ్యాటింగ్ పరంగా అద్భుతాలను ఆవిష్కరిస్తూనే ఉన్నారు. ఈ జాబితాలో భారత ప్లేయర్లు మాత్రమే కాదు విదేశీ ప్లేయర్లు కూడా ఉన్నారు.
వేగానికి సంబంధించిన ప్రస్తావన వస్తే ఐపిఎల్ కచ్చితంగా గుర్తుకు వస్తుంది. అయితే ఇప్పుడు ఐపీఎల్ ను సైతం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వెనక్కు నెడుతోంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో మహిళ బ్యాటర్లు దుమ్ము లేపుతున్నారు. ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా బ్యాటింగ్ చేస్తున్నారు.
మంగళవారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ జట్టుపై ఢిల్లీ బ్యాటర్లు అదరగొట్టారు. ఢిల్లీ జట్టులో నిక్కీ ప్రసాద్ (24 బంతుల్లో 47), స్నేహ్ రాణా(15 బంతుల్లో 29) పరుగుల వరద పారించారు.
సోఫీ వేసిన 17 ఓవర్ లో నిక్కీ ప్రసాద్ వరసగా నాలుగు ఫోర్లు కొట్టింది. ఐదో బతికి లెగ్ బై ద్వారా సింగల్ పరుగు లభించింది. చివరి బంతిని రాణా సిక్సర్ కొట్టింది. సరితగా ఈ ఓవర్లో ఏకంగా 23 పరుగులు వచ్చాయి. మొదటి నాలుగు బంతులు బౌండరీలుగా వెళ్లిపోయాయి. ఐదవ బంతికి సింగిల్.. ఆరవ బంతి సిక్సర్ గా వెళ్లడంతో మొత్తంగా 23 పరుగులు వచ్చాయి.
గార్డ్ నర్ 19వ ఓవర్ లో స్నేహితు స్నేహ్ రాణా వరుసగా సిక్సర్, 4, 4 కొట్టింది. నాలుగో బంతికి సింగల్ తీసింది. చివరి రెండు బంతులలో నిక్కీ ప్రసాద్ ఒక బౌండరీ, ఒక సింగిల్ తీసింది. ఈ ఓవర్ లో 20 పరుగులు వచ్చాయి. అయినప్పటికీ ఢిల్లీ గెలుపును అందుకోలేకపోయింది. చివరి ఓవర్ లో వీరిద్దరూ ఔట్ కావడంతో ఢిల్లీ జట్టుకు ఓటమి తప్పలేదు.