ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్ ఎంత మజా ఇచ్చిందో అందరికీ తెలిసిందే. ఓటమి నుంచి విజయం దిశగా భారత జట్టు పయనించిన తీరు.. దాంతోపాటు బలమైన ఆస్ట్రేలియాను.. వారి దేశంలో ఓడించి చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా అభిమానులు భారత క్రికెటర్లపై చేసిన జాత్యంహకార వ్యాఖ్యలు సైతం మన క్రికెటర్లలో పట్టుదల పెంచి ఆస్ట్రేలియాను చిత్తు చేయడానికి అవకాశం కల్పించింది.
Also Read: ఆస్ట్రేలియా దెబ్బ.. ఇంగ్లండ్ కూడా ‘అబ్బా’ అంటోంది?
ఆస్ట్రేలియాను ఓడించిన టీమిండియా ఇప్పుడు మన దేశంలో ఇంగ్లండ్ జట్టుతో పోటీకి సిద్ధమైంది. స్వదేశంలో జరుగనున్న భారత్-ఇంగ్లండ్ సిరీస్ కు రంగం సిద్ధమైంది. చెన్నై వేదికగా రెండు టెస్టులు జరుగనున్నాయి.
అయితే భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూద్దామని అనుకుంటున్న ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. తొలి రెండు టెస్టులకు ప్రేక్షకులను అనుమతించడం లేదని బీసీసీఐ తెలిపింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో క్రికెటర్లు, ప్రేక్షకుల భద్రత దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read: స్మిత్, మ్యాక్స్ వెల్, హర్భజన్ ఔట్.. ఐపీఎల్ లో దిగ్గజాలను వదులుకున్న జట్లు
ఇక తమిళనాడు క్రికెట్ సంఘం కూడా దీన్ని ధ్రువీకరించింది. చెన్నై వేదికగా జరిగే టెస్టులకు ప్రేక్షకులను అనుమతించడం లేదని సంఘం కార్యదర్శి రామస్వామి ప్రకటించారు. కరోనా వైరస్ తమిళనాడులో అధికంగా ఉండడంతో క్రికెటర్లు, ప్రేక్షకుల భద్రత దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో ప్రేక్షకులను అనుమతించి ఆ సిరీస్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచారు. భారీగానే ప్రేక్షకులు హాజరయ్యారు. దాదాపు ఏడాదిగా క్రికెట్ ను అస్వాదించలేని ప్రేక్షకులు భారత సిరీస్ తో ఆ లోటును భర్తీ చేసుకున్నారు. కానీ భారత్ లో మాత్రం కరోనా తీవ్రత దృష్ట్యా ప్రేక్షకులను అనుమతించడం లేదు.