దేశంలోని హిందువులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. ఎన్నో దశాబ్ధాలుగా వివాదంలో చిక్కుకొని చివరకు సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్య రామ జన్మభూమి స్థలం దక్కించుకున్న అయోధ్య ట్రస్ట్ తాజాగా విరాళాలు సేకరించి రామ మందిర నిర్మాణాన్ని తాజాగా మొదలుపెట్టింది. రెండు నెలల క్రితం ఆగిపోయిన అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు ఎట్టకేలకు తిరిగి ప్రారంభమయ్యాయి.
Also Read: చట్టసభల్లో ఆధిపత్యం కోసం బైడెన్ ఫోకస్
నిజానికి భూమి పూజ తర్వాతనే పనులు ప్రారంభించాల్సి ఉండగా.. రెండు నెలల క్రితం భూగర్భజల సమస్యతో పనులు ఆగిపోయాయి. జలం పైకి ఉండడంతో లోతుగా తీస్తే జలం వచ్చి పనులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో ఇప్పుడు వేసవి తీవ్రత పెరగడం.. జలం కిందకు పోవడంతో పనులు ప్రారంభమయ్యాయి.
రామమందిర నిర్మాణ పనులు ప్రారంభమైనట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర సభ్యులు డాక్టర్ అనిల్ మిశ్ర అధికారికంగా ప్రకటించారు.
Also Read: చంద్రబాబు ‘వ్యూహకర్త’ ప్లాన్లు ఫెయిల్ యేనా?
దేశంలోనే దిగ్గజ కంపెనీలైన ‘లార్సెన్-టుబ్రో, టాటా కన్సల్టింగ్ సంస్థ ఇంజనీర్ లతో చర్చించిన అనంతరం ఆలయ నమూనాలకు తుది ఆమోదం తెలిపినట్లు అనిల్ మిశ్ర తెలిపారు. పూజ చేసి, ఆలయ నిర్మాణ పనులను మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు.
ఆలయ స్థలంలో ఉన్న శిథిలాల్ని తొలగించడానికి 70 రోజులు పడుతుందని అనిల్ మిశ్ర తెలిపారు. పూజలో రామ మంది నిర్మాణ ప్యానెల్ సభ్యులు పాల్గొని కొనసాగించారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్