ఏడు శనివారాలు ఈ విధంగా చేస్తే కోరికలు నెరవేరుతాయి..!

  శనివారం అంటేనే ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి కి ఎంతో ప్రీతికరమైన రోజు అని చెప్పవచ్చు.భక్తుల కోరికలను కొంగుబంగారం చేసే శ్రీవారిని దర్శించుకోవడానికి దేశవిదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటారు. శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల శని బాధలు సైతం తొలగిపోతాయని పండితులు తెలియజేస్తున్నారు. అంతే కాకుండా మనకు ఏవైనా తీరని కోరికలు ఉన్నా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా పూజ చేయడం ద్వారా అనుకున్న కోరికలు […]

Written By: Navya, Updated On : July 16, 2021 12:38 pm
Follow us on

 

శనివారం అంటేనే ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి కి ఎంతో ప్రీతికరమైన రోజు అని చెప్పవచ్చు.భక్తుల కోరికలను కొంగుబంగారం చేసే శ్రీవారిని దర్శించుకోవడానికి దేశవిదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటారు. శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల శని బాధలు సైతం తొలగిపోతాయని పండితులు తెలియజేస్తున్నారు. అంతే కాకుండా మనకు ఏవైనా తీరని కోరికలు ఉన్నా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా పూజ చేయడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అయితే పూజ ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం…

Also Read: జనవరి లో పుట్టిన వారికి వంకాయ రంగు అదృష్టమేనా..?

శనివారం ఉదయం తలంటు స్నానం చేసే పూజ గదిని ప్రత్యేకంగా అలంకరించి వెంకటేశ్వరస్వామి ఫోటో లేదా విగ్రహానికి పూజలు నిర్వహించాలి. ఈ పూజ చేయడం కోసం బియ్యపు పిండితో చేసిన ప్రమిదలో అరటిపండు, పాలు, బెల్లంవేసి ప్రమిదను తయారు చేయాలి. ఈ ప్రమిదలు ఏడు వత్తులను వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఈ విధంగా ఏడు శనివారాలు క్రమం తప్పకుండా పూజ చేయటం వల్ల ఆ వేంకటేశ్వరుని అనుగ్రహం మనపై కలిగి తీరని కోరికలు నెరవేరుతాయి.

Also Read: దేవాలయాలకు కానుకలతో పాటు ఇవి సమర్పిస్తే..?

అదేవిధంగా శనివారం వెంకటేశ్వర స్వామి తో పాటు విష్ణు భగవాన్ కి కూడా ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ స్వామి వారిని ఆలయాన్ని దర్శించుకునే సమయంలో లో స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి మాలను సమర్పించి నేతి దీపం వెలిగించడం ద్వారా స్వామివారి అనుగ్రహం కలిగి తీరని కోరికలు నెరవేర్చడమే కాకుండా, ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి, అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉంటారని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం