https://oktelugu.com/

ENG VS PAk : పాకిస్తాన్ తో తలపడేందుకు ఇంగ్లాండ్ జట్టు రెడీ.. దిగ్గజ ఆటగాడి రీ – ఎంట్రీ.. దాయాది జట్టుకు మరో వైట్ వాష్ తప్పదా..

శ్రీలంక జట్టుతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను ఇంగ్లాండ్ గెలుచుకుంది. స్వదేశంలో జరిగిన ఈ టోర్నీలో 2-1 తేడాతో నెగ్గి.. ట్రోఫీ సొంతం చేసుకుంది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఇంగ్లాండ్ మరో కీలకమైన టోర్నీకి సిద్ధమవుతోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 10, 2024 / 10:04 PM IST

    ENG VS PAk test Series

    Follow us on

    ENG VS PAk :  అక్టోబర్లో పాకిస్తాన్ జట్టుతో ఇంగ్లాండ్ మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం 17 మంది సభ్యుల జట్టును ఇంగ్లాండు సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టుకు బెన్ స్టోక్స్ కెప్టెన్ గా నియమితులయ్యాడు. ఇటీవల శ్రీలంక సిరీస్ కు స్టోక్స్ దూరంగా ఉన్నాడు. అతడికి గాయం కావడంతో జట్టు మేనేజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. పాకిస్తాన్ జట్టుతో జరిగే సిరీస్ ద్వారా ఇంగ్లాండ్ జట్టులోకి స్టోక్స్ తో పాటు రెహాన్ అహ్మద్, జాక్ లీచ్, జాక్ క్రాలే ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఈ సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు మేనేజ్మెంట్ బ్రైడన్ కార్స్, జోర్డన్ కాక్స్ కు ఎంపిక చేసింది. వీరిలో కార్స్ డర్హం(ఇంగ్లాండ్ దేశవాళి జట్టు) జట్టుకు సీమర్ గా ఉన్నాడు. జోర్డన్ కాక్స్ ఎసెక్స్ (ఇంగ్లాండ్ దేశవాళి జట్టు)కు బ్యాటర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే వీరిద్దరూ అన్ క్యా ప్డ్ ఆటగాళ్లు కావడం విశేషం.

    వారంలోగా స్పష్టత

    ఈ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టులో ఇంగ్లాండ్ పర్యటిస్తుంది. అయితే మ్యాచ్ ల నిర్వహణకు సంబంధించి వేదికలు సరిగా లేకపోవడంతో.. సిరీస్ యూఏఈ లో నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. అయితే వేదికల మార్పుపై ఈ వారంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ 7 నుంచి ముల్తాన్ వేదికగా తొలి టెస్ట్, అక్టోబర్ 15 నుంచి కరాచీ వేదికగా రెండవ టెస్టు, అక్టోబర్ 24 నుంచి రావల్పిండి వేదికగా మూడవ టెస్ట్ నిర్వహిస్తామని ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.. అయితే ఈ వేదికలు మారే అవకాశం ఉన్నట్టు స్పోర్ట్స్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఇంగ్లాండ్ జట్టు 2022లో మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం పాకిస్థాన్ లో పర్యటించింది. అప్పుడు 3-0 తేడాతో సిరీస్ వైట్ వాష్ చేసింది.. ఇక ఇటీవల బంగ్లాదేశ్ పాకిస్తాన్ తో రెండు టెస్టుల సిరీస్ ఆడింది. 2-0 తేడాతో ట్రోఫీ దక్కించుకుంది. దీంతో ఈసారి ఇంగ్లాండ్ చేతిలో కూడా పాకిస్తాన్ కు పరాభవం తప్పదని క్రీడా పండితులు అంటున్నారు.. మరో వైపు పాకిస్తాన్ జట్టు అంతర్గత కలహాలతో ఇబ్బంది పడుతోంది. గెలిచే మ్యాచ్ లను ఓడిపోతోంది. తమకంటే బలమైన ఇంగ్లాండ్ జట్టును పాకిస్తాన్ ఎలా ఎదుర్కొంటుందో.. వేచి చూడాల్సి ఉంది.

    మేనేజ్మెంట్ ప్రకటించిన జట్టు ఇదే

    బెన్ స్టోక్స్(కెప్టెన్), వోక్స్, స్మిత్, స్టోన్, పోప్, లీచ్, హల్, డకెట్, పాట్స్, రూట్, క్రాలే, కాక్స్, కార్స్, బ్రూక్, బషీర్, రెహన్ అహ్మద్, అట్కిన్సన్.