West Indies Vs England: టి20 టికెట్ వరల్డ్ కప్ లో పడుతూ, లేస్తూ సూపర్ -8 దాకా వచ్చిన ఇంగ్లాండ్.. సూపర్ -8 తొలి పోరులో డిపెండింగ్ ఛాంపియన్ లాగా ఆడింది. వెస్టిండీస్ జట్టుతో గురువారం జరిగిన మ్యాచ్లో అదరగొట్టింది. సెయింట్ లూసియా వేదికగా ఆతిధ్య కరేబియన్ జట్టును ఎనిమిది టికెట్ల తేడాతో పడగొట్టింది . అన్ని విభాగాలలో సత్తా చాటిన ఇంగ్లాండ్ గ్రూప్ -2 లో టేబుల్ టాపర్ గా (ప్రస్తుతానికి) ఆవిర్భవించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 180 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో జాన్సన్ చార్లెస్ 38 పరుగులు చేసి, టాప్ స్కోరర్ గా నిలిచాడు. పావెల్ బంతుల్లో 36, రూథర్ ఫర్డ్ 15 బంతుల్లో 28* పరుగులు చేసి ఆకట్టుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, మొయిన్ అలీ, ఆర్చర్, లివింగ్ స్టోన్ తల ఒక వికెట్ దక్కించుకున్నారు. అనంతరం లక్ష్య చేదనకు దిగిన ఇంగ్లాండ్.. 17.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 87* పరుగులతో ఆకట్టుకున్నాడు. 47 బంతుల్లో ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్లతో మైదానంలో విధ్వంసం సృష్టించాడు. జానీ బెయిర్ స్టో 26 బంతుల్లో 45 పరుగులు చేసి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. చేజింగ్ లో ప్రారంభం నుంచి ఇంగ్లాండ్ మొదటి చేయి సాధించింది. పవర్ ప్లే లో ఏకంగా 58 పరుగులు చేసి, ఆకట్టుకుంది. బట్లర్ 22 బంతుల్లో 25, మొయిన్ అలీ బంతుల్లో 13 పరుగులు చేసి.. వెంట వెంటనేనో పెవిలియన్ చేరుకున్నప్పటికీ.. బెయిర్ స్టో, సాల్ట్ ఇంగ్లాండ్ జట్టును విజయ తీరాలకు చేర్చారు. ముఖ్యంగా సాల్ట్ చివరి 5 ఓవర్లలో ఇంగ్లాండ్ విజయానికి 40 పరుగులు కావాల్సి వచ్చినప్పుడు.. మైదానంలో తుఫాన్ సృష్టించాడు. రొమారియో షెఫర్డ్ వేసిన 16 ఓవర్లో ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు.
మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలి బంతిని ఎక్స్ ట్రా కవర్ మీదుగా ఫోర్ కొట్టాడు. రెండవ బంతిని బౌలర్ తల మీదుగా సిక్సర్ గా మలిచాడు. స్లో షార్టర్ గా వచ్చిన మూడో బంతిని అప్పర్ కట్ తో బౌండరీకి తరలించాడు. ఆ తర్వాత నాలుగో బంతిని లాంగ్ ఆఫ్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు. మరో బంతిని డీప్ బ్యాక్ వర్డ్ స్క్వేర్ మీదుగా రెప్పపాటులో సిక్సర్ గా మలిచాడు. ఇక చివరి బంతి ఫుల్ టాస్ గా రావడంతో దానిని అత్యంత సులభంగా ఫోర్ కొట్టాడు.. 4,6,4,6,6,4 ఇలా 30 పరుగులు చేసి ఇంగ్లాండ్ ను విజయపథంలోకి మళ్ళించాడు. ఈ బౌలింగ్ ద్వారా అత్యంత చెత్త రికార్డును తన పేరు మీద షెఫర్డ్ నమోదు చేసుకున్నాడు. టి20 వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న ఆరవ బౌలర్ గా వినతికెక్కాడు. ఈ జాబితాలో ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ 36 పరుగులు, ఆఫ్గనిస్తాన్ బౌలర్ అజ్మతుల్లా ఓమర్జాయ్ 36 పరుగులతో తొలి రెండు స్థానాలలో కొనసాగుతున్నారు.