Odi World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి టీం కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇస్తు ముందుకెళ్తున్నాయి. ఇక ఈ వరల్డ్ కప్ లో హైలైట్ గా చెప్పుకోవాల్సిందేంటంటే అంచనాలను ఏమాత్రం లేకుండా బరిలోకి దిగిన కొన్ని జట్లు అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తూ ముందుకు దూసుకెళ్తుంటే ఇంగ్లాండ్ లాంటి టీములు మాత్రం వరుసగా ఫెయిల్ అవుతు చాలా చెత్త పర్ఫామెన్స్ ఇస్తూ మ్యవరుస ఓటమిలను ఎదురుకుంటుంది. ఇంగ్లాండ్ టీం ఆడిన ప్రతి మ్యాచ్ లో కనీస పోటీని కూడా ఇవ్వకుండా చేతులెత్తేస్తూ ప్రతి మ్యాచ్ లో ఘోరమైన ఓటమిని చవిచూస్తుంది.
ఇక నిన్న శ్రీలంక తో ఆడిన మ్యాచ్ లో కూడా దారుణమైన ఓటమిని చవిచూసింది. దాంతో ఇంగ్లాండ్ వరుసగా మూడోవ ఓటమిని అందుకుంది.ఇక ఇప్పటివరకు ఇంగ్లాండ్ 5 మ్యాచ్ లు ఆడితే 4 మ్యాచ్ లు ఓడిపోయి ఒక మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది. అంటే ఇంగ్లాండ్ టీం ప్లేయర్లు మ్యాచ్ విన్నింగ్ కోసం అసలు ట్రై చేయడం లేదు అని వాళ్ల స్కోరులని చూస్తే అర్థమవుతుంది.శ్రీలంక మీద 156 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యారు. ఇంతకుముందు ఆస్ట్రేలియా మీద 170 పరుగులు మాత్రమే చేసి ఆలౌవుటయ్యారు.
ఇలా ప్రతి టీం మీద కూడా వాళ్ళు స్కోర్ ఎక్కువ చేయలేక చాలా దారుణంగా ఫెయిల్ అవుతున్నారు. అయితే ఇంగ్లాండ్ టీమ్ వరల్డ్ కప్ లో ఎవరు ఊహించని విధంగా ఓటమిపాలవుతుంటే నెదర్లాండ్,ఆఫ్గనిస్తాన్ టీమ్ లు మాత్రం వరుసగా పెద్ద జట్లకి షాక్ లు ఇస్తు మంచి విజయాలను అందుకుంటున్నారు ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ టీమ్ సెమిస్ రేస్ లో ఉంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆఫ్గనిస్తాన్ టీం ఎంత మంచి పర్ఫామెన్స్ ఇస్తుందో…
ఇక ఈసారి వరల్డ్ కప్ అందరికీ మంచి ఉత్సాహం ఇస్తే ఇంగ్లాండ్ టీమ్ కి మాత్రం ఘోర పరాభావాన్ని మూటగట్టుకునేలా చేస్తుంది…అయితే ఇంగ్లాండ్ లాస్ట్ టైం టైటిల్ గెలిచి ప్రతి ఒక్క టీం కి మంచి ఇన్స్పిరేషన్ గా నిలిచింది. కానీ ఇప్పుడు మాత్రం చాలా అంచనాలతో బరిలోకి దిగిన వాళ్ళ ఆడిన మొదటి మ్యాచ్ లోనే న్యూజిలాండ్ మీద ఓడిపోవడంతో అప్పటినుంచి వాళ్ళ పరాభవం అనేది కొనసాగుతూనే ఉంది. ఇంగ్లాండ్ ఓటమికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆ టీంలో ఉన్న ప్లేయర్లు ఎవ్వరూ కూడా ఫామ్ లో లేకపోవడం ఒకటైతే,కనీసం మిడిల్ ఆర్డర్ లో ఉన్న ఒక ప్లేయర్ కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఆడలేకపోతున్నాడు. నిజానికి బట్లర్ కూడా ఇంతకుముందు చాలా మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు. కానీ ఇప్పుడు మాత్రం ఒక్క ఇన్నింగ్స్ లో కూడా తనదైన సత్తా చాటలేకపోతున్నాడు.
ముఖ్యంగా బట్లర్ ని కెప్టెన్ చేసి ఇంగ్లాండ్ టీమ్ చాలా పెద్ద తప్పు చేసిందనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. కెప్టెన్ అవ్వకముందు బట్లర్ తనదైన రీతిలో చాలా బాగా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు కెప్టెన్ చేయడం వల్ల ఆయన మీద మరీ ఎక్కువ ప్రేజర్ పెడుతున్నట్టుగా తెలుస్తుంది.ఈ క్రమంలో ఇంగ్లాండ్ టీమ్ అటు బ్యాటింగ్ లో గాని, ఇటు బౌలింగ్ లో గానీ చెత్త పర్ఫామెన్స్ ఇస్తూ ఆల్మోస్ట్ సెమిస్ నుంచి తప్పు కుంది…ఇకమీదట ఇంకో నాలుగు మ్యాచ్ లు ఆడాల్సిన ఇంగ్లాండ్ టీమ్ ఆ మ్యాచ్ ల్లో భారీ విజయాలతో గెలిస్తే తప్ప ఇంగ్లాండ్ టీం సెమిస్ కి వెళ్లే అవకాశాలు అయితే లేవు…