ENG vs SL : శ్రీలంకను ఓడించడానికి బంతితో అంత పన్నాగం పన్నిందా? ఇంగ్లాండ్ జట్టుపై నెట్టింట ఆరోపణలు

మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో శ్రీలంక ఓటమిపాలైంది. అయితే ఈ ఓటమి నేపథ్యంలో శ్రీలంక అభిమానులు ఇంగ్లాండ్ ఆటగాళ్లపై విమర్శలు కురిపిస్తున్నారు.

Written By: NARESH, Updated On : August 25, 2024 9:52 pm

ENG vs SL

Follow us on

ENG vs SL: మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ లో ఇంగ్లాండ్ జట్టు 5 వికెట్ల తేడాతో శ్రీలంక జట్టుపై విజయం సాధించింది. తద్వారా 1-0 లీడ్ లో కొనసాగుతోంది. తొలి టెస్ట్ లో ఇంగ్లాండ్ విజయం సాధించిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. అందువల్లే శ్రీలంక జట్టు ఓడిపోయిందని ఆ దేశ అభిమానులు వాపోతున్నారు. తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 358 రన్స్ చేసింది. శ్రీలంక 236 రన్స్ మాత్రమే చేయగలిగింది. అనంతరం 122 పరుగుల లోటుతో శ్రీలంక జట్టు రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఈ దశలో 95 పరుగులకు నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సీనియర్ బాటర్ మాథ్యూస్ 65, కమిందు మెండిస్ 113 రన్స్ చేసి.. శ్రీలంక ఇన్నింగ్స్ ను కాపాడే ప్రయత్నం చేశారు. మొత్తానికి శ్రీలంక జట్టును 24 పరుగుల లీడ్ లోకి తీసుకొచ్చారు. 25 ఓవర్ల పాటు ఇంగ్లాండ్ బౌలర్లను కాచుకుంటూ శ్రీలంక జట్టును నిలబెట్టారు. నాలుగు వికెట్లకు 146 పరుగుల వద్ద శ్రీలంక ఇన్నింగ్స్ ఉన్నప్పుడు.. ఇంగ్లాండ్ జట్టు కొత్త బంతిని అందుతుంది. అంతకుముందు వాడిన బాల్ లో కేవలం షైనింగ్ మాత్రమే పోయింది. అయినప్పటికీ ఆ జట్టు బంతిని మార్చింది. ఇంగ్లాండ్ జట్టు కొత్త బంతిని తీసుకున్న కొద్దిసేపటికే శ్రీలంక బ్యాటర్ మాథ్యూస్ ఔట్ అయ్యాడు. ఐదవ వికెట్ కు 78 పరుగులు జత చేసిన మాథ్యూస్ ఔట్ కావడంతో శ్రీలంక ఒక్కసారిగా నిరాశలో కూరుకుపోయింది.. ఈ దశలో కుషాల్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. ఏడవ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి సెంచరీ చేసి.. ఇంగ్లాండ్ గడ్డపై చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ ఎదుట 205 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక ఉంచింది. దీనిని ఇంగ్లాండ్ జట్టు సునాయాసంగా చేదించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ అర్థ పంచరితో ఆకట్టుకున్నాడు. ఇదే క్రమంలో అత్యధిక అర్థ సెంచరీలు సాధించిన మూడవ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

బంతిని మార్చి గెలిచిందట

బంతిని మార్చి.. ఇంగ్లాండ్ గెలిచిందని శ్రీలంక అభిమానులు ఆరోపిస్తున్న నేపథ్యంలో.. శ్రీలంక ఆటగాడు మాథ్యూస్ స్పందించాడు..” బంతిని ఎందుకు మార్చారో నాకు తెలియదు. పాత బంతి తో ఆడుతున్న సమయం వరకు మేము అత్యంత పార్టీష్టమైన స్థితిలో ఉన్నాం. కొత్త బంతిని తీసుకున్న తర్వాత ఒక్కసారిగా మ్యాచ్ లో బలుపు చోటుచేసుకుంది. మైదానంలో బంతి రెండువైపులా స్వింగ్ అవడం మొదలైంది. అది బ్యాటర్లకు తీవ్ర ఇబ్బందిగా మారింది. దీంతో బంతి పాతబడే వరకు ఆయాల్సి వచ్చింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫలితంగా మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయిందని” మాథ్యూస్ వ్యాఖ్యానించాడు. మరోవైపు బంతిని మార్చడం సరైన నిర్ణయమేనని ఇంగ్లాండ్ ఆటగాళ్లు సమర్ధించుకుంటున్నారు.