ENG Vs SA: క్రికెట్ ఇంగ్లాండ్ లో పుట్టింది. ప్రపంచం మొత్తం విస్తరించింది. ఫుట్ బాల్ తర్వాత అత్యంత ఆదరణ పొందిన ఆటగా పేరు తెచ్చుకుంది.. అటువంటి దేశం క్రికెట్ లో నిరాశ జనకమైన ఆటతీరు ప్రదర్శిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లిగ్ మ్యాచ్లో భాగంగా ఇటీవల ఆస్ట్రేలియా జట్టుతో తలపడింది. 350 పరుగుల స్కోర్ చేసినప్పటికీ దానిని నిలుపుకోలేకపోయింది. ఆస్ట్రేలియా ద్వితీయ జట్టుతో ఆడినప్పటికీ ఇంగ్లాండ్ విధించిన లక్ష్యాన్ని చేదించింది. ఫలితంగా ఇంగ్లాండ్ పరువు పోయింది. ఈ ఓటమి ద్వారా ఇంగ్లాండ్ వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్ ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలోనూ విఫల ప్రదర్శన చేసింది.
Also Read: నా తమ్ముడి ఇంటి జనరేటర్ లో పంచదార పోయడానికి కారణం అదే : మంచు విష్ణు
సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టిన ఇంగ్లాండ్ జట్టు..గ్రూప్ – బీ లో లీగ్ దశలో సౌత్ ఆఫ్రికా తో లాహోర్ వేదికగా శనివారం చివరి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా స్టార్ పేస్ బౌలర్, ఐపీఎల్ లో పంజాబీ జట్టు తరఫున ఆడుతున్న మార్కో జాన్సెన్స్(3/39) అదరగొట్టాడు.. అతడికి వియాన్ మల్డర్(3/25) కూడా తోడు కావడంతో ఇంగ్లాండ్ జట్టు వణికిపోయింది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. 38.2 ఓవర్లలో 179 పరుగులకే ఆల్ అవుట్ అయింది..జో రూట్(37) పరులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక మిగతా ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లాండ్ ఓపెనర్లు సాల్ట్(8), బెన్ డకెట్(24) గొప్ప ఇన్నింగ్స్ ఆడ లేక పోయారు.. జెమీ స్మిత్ (0) గోల్డెన్ డక్ అవుటయ్యాడు.. క్రీజ్ లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించిన హ్యారీ బ్రూక్(19), జోస్ బట్లర్(21), జో రూట్(37), లియామ్ లివింగ్ స్టోన్(9), జెమీ ఓవర్టన్(11) ఆకట్టుకోలేకపోయారు. జోఫ్రా ఆర్చర్ (25) కాసేపు పోరాడినప్పటికీ.. అది ఇంగ్లాండ్ జట్టుకు సరిపోలేదు. ఆదిల్ రషీద్ (2) అవుట్ కావడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 179 పరుగుల వద్ద ముగిసింది.
పంజాబ్ బౌలర్ అదరగొట్టాడు
మార్కో జాన్సన్, వియాన్ మల్డర్ చెరి మూడు వికెట్లు పడగొట్టారు. ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు చూపించారు. మార్కో జాన్సన్ ఐపీఎల్ లో పంజాబ్ జట్టు తరఫున ఆడుతున్నాడు.. కేశవ్ మహారాజ్(2/35) రెండు వికెట్లు సాధించాడు..ఎంగిడి, రబడా తలా ఒక క్రికెట్ పడగొట్టారు. మార్కో జాన్సన్ అదిరిపోయే రేంజ్ లో బౌలింగ్ వేయడంతో పంజాబ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏడు కోట్లు వెచ్చించి మార్కో జాన్సన్ ను కొనుగోలు చేసింది. పంజాబ్ జట్టు ఈ సీజన్లో స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. 2008 నుంచి ఇప్పటివరకు పంజాబ్ జట్టు ఐపిఎల్ ట్రోఫీ దక్కించుకోలేదు. ఈసారి ఈ అపప్రదను తొలగించుకోవాలని భావిస్తోంది.. పంజాబ్ జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహిస్తున్నాడు. గత సీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు అతడు సారధ్యం వహించాడు. గడచిన సీజన్లో కోల్ కతా జట్టు ఐపీఎల్ విన్నర్ గా నిలిచింది.
Also Read: రాజశేఖర్, శంకర్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదేనా..? చేసుంటే పాన్ ఇండియన్ స్టార్ హీరో అయ్యేవాడు