Eng Vs Pak 2nd Test: 52 సంవత్సరాల తర్వాత టెస్ట్ క్రికెట్ లో రికార్డ్ క్రియేట్ చేసిన పాకిస్థాన్ బౌలర్లు…

ప్రస్తుతం టెస్ట్ ఫార్మాట్ లో పాకిస్థాన్ టీమ్ భారీ విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతుంది. మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన కూడా రెండో మ్యాచ్ లో తమ సత్తా చాటుకున్న పాకిస్తాన్ తమదైన రీతిలో ఒక భారీ విక్టరీని సాధించిందనే చెప్పాలి...

Written By: Gopi, Updated On : October 18, 2024 5:24 pm

Eng Vs Pak 2nd Test

Follow us on

Eng Vs Pak 2nd Test: ఇంగ్లాండ్ పాకిస్తాన్ మధ్య టెస్ట్ సీరీస్ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక మూడు టెస్టుల్లో భాగంగా రీసెంట్ గా ఆడిన రెండో టెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండ్ పైన పాకిస్తాన్ 152 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ముఖ్యంగా పాకిస్తాన్ బౌలర్లు ఈ మ్యాచ్ లో చెలరేగిపోయారనే చెప్పాలి. నిజానికి మొదటి నుంచి కూడా పాకిస్తాన్ లో చాలా మంచి బౌలర్లు ఉన్నారు. కాని వాళ్ళ మధ్య సమిష్టిగా రాణించాలనే ఒక పట్టుదల లేకపోవడం వల్లే వీళ్లు అంత బాగా రాణించలేకపోతుంటారు. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం బౌలర్లు చాలా అద్భుతమైన బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ టీమ్ ను మట్టి కరిపించడం లో చాలా వరకు కృషి చేశారు. ముఖ్యంగా నోమన్ అలీ మొదటి ఇన్నింగ్స్ లో 3 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్ లో 8 వికెట్లు తీశాడు. ఇక సాజిద్ ఖాన్ మొదటి ఇన్నింగ్స్ లో 7 వికెట్లు సెకండ్ ఇన్నింగ్స్ లో 2 వికెట్లు తీశాడు. మొత్తం ఈ ఇద్దరు కలిసి 20 వికెట్లు తీయడం అనేది పాకిస్తాన్ బౌలింగ్ టీమ్ ఎంత పటిష్టంగా ఉందో చెప్పకనే చెబుతుంది. ఇక ఇద్దరూ కలిసి 20 వికెట్లు తీసిన ఏడో ద్వయం గా చరిత్రలో రికార్డును క్రియేట్ చేశారు. ఇక ఇన్ని సంవత్సరాల నుంచి ఒక మ్యాచ్ లో ఇద్దరు బౌలర్లు కలిసి 20 తీయడం అనేది ఇదే మొదటిసారి కావడం విశేషం. మరి మొత్తానికైతే పాకిస్తాన్ బౌలర్లు తమదైన రీతిలో రెచ్చిపోయి బౌలింగ్ చేయడం ఆ టీమ్ కి నిజంగా కలిసి వస్తుంది. ఇక 3 టెస్ట్ ల్లో భాగంగా మొదటి టెస్టు ఇంగ్లాండు గెలిస్తే, రెండో టెస్టు పాకిస్తాన్ విజయం సాధించింది.

మరి మూడో టెస్ట్ లో ఎవరు విజయం సాధించబోతున్నారనేది తెలియాలంటే టెస్ట్ మ్యాచ్ జరిగేంత వరకు వెయిట్ చేయాల్సిందే… ఇక ఏది ఏమైనా కూడా పాకిస్తాన్ బౌలర్ల వల్లే ఆ టీమ్ చాలా పటిష్టంగా ఉందనేది మరోసారి ప్రూవ్ అయింది. ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ టీం మొదటి ఇన్నింగ్స్ లో 366 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది. ఇక ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 291 పరుగులు మాత్రమే చేసింది…

ఇక రెండో ఇన్నింగ్స్ లో పాకిస్థాన్ 221 పరుగులు చేసింది. ఇక 297 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ టీమ్ కేవలం 144 పరుగులకే అలౌట్ అయింది. దాంతో 152 పరుగుల భారీ తేడాతో తో పాకిస్థాన్ టీమ్ ఇంగ్లాండ్ టీమ్ ను మట్టి కరిపించింది… ఇక మొత్తానికైతే మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ మీద ఓడిపోయిన పాకిస్థాన్ రెండో మ్యాచ్ లో మాత్రం ఇంగ్లాండ్ మీద భారీ రివెంజ్ తీర్చుకుందనే చెప్పాలి.

మరి మూడో మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు కప్పు అందుకోబోతున్న సందర్భంలో రెండు టీమ్ లు కూడా మూడో మ్యాచ్ మీద భారీ కసరత్తులు చేస్తూ బరిలోకి దిగబోతున్నారు అనేది చాలా స్పష్టం గా తెలుస్తుంది…