Manasi Kirloskar: నోయెల్ టాటా కోడలు మానసి ఎవరో తెలుసా..? ఆమె ఇప్పుడు ఏం చేస్తుందంటే..?

నోయెల్ టాటా, అతని కుటుంబం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆయన కోడలు మానసి టాటా కిర్లోస్కర్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. అసలు ఆమె ఎవరు? ఏం చేస్తుందని మానసి ఓ కార్ల కంపెనీ బాధ్యతలను చూసుకుంటుంది.

Written By: Mahi, Updated On : October 18, 2024 5:04 pm

Manasi Kirloskar

Follow us on

Manasi Kirloskar: నోయెల్ టాటాకు టాటా ట్రస్ట్ పగ్గాలు దక్కడంతో ఆయన కుటుంబం వార్తల్లో నిలిచింది. రతన్ టాటా మరణానంతరం ఆయన వారసుడిగా నోయల్ టాటా నియమితులయ్యారు. ఆయనను టాటా ట్రస్ట్ చైర్మన్ గా నియమించారు. టాటా గ్రూప్ టాటా ట్రస్ట్స్ యాజమాన్యంలో ఉంది కాబట్టి టాటా ట్రస్ట్ బాధ్యతను పొందిన తర్వాత, ప్రజలు నోయెల్ టాటా, అతని కుటుంబం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆయన కోడలు మానసి టాటా కిర్లోస్కర్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. అసలు ఆమె ఎవరు? ఏం చేస్తుందని మానసి ఓ కార్ల కంపెనీ బాధ్యతలను చూసుకుంటుంది. ఇది తన తండ్రి కంపెనీ. నోయెల్ టాటా ఏకైక కుమారుడు నోవిల్ టాటా 2019లో మానసి కిర్లోస్కర్ ను వివాహం చేసుకున్నారు. వీరు ముంబైలోని రతన్ టాటా ఇంట్లో వివాహం చేసుకున్నారు. మానసి దేశంలోని పురాతన పారిశ్రామిక సంస్థల్లో ఒకటైన కిర్లోస్కర్ కుటుంబానికి చెందింది. ఆమె విక్రమ్ కిర్లోస్కర్-గీతాంజలి కిర్లోస్కర్ కు 1990, ఆగస్టు 7న జన్మించారు. టయోటా మోటార్స్ సహా కిర్లోస్కర్ గ్రూప్ కింద అనేక కంపెనీలున్నాయి. ఇది జపాన్ కు చెందిన టయోటా, కిర్లోస్కర్ ల జాయింట్ వెంచర్.

మానసి కిర్లోస్కర్ ఏం చేస్తుంది?
మానసి తండ్రి విక్రమ్ కిర్లోస్కర్ 2023లో మరణించారు. ఆ తర్వాత మానసి ‘కిర్లోస్కర్’ గ్రూప్ లో కొన్ని కంపెనీల బాధ్యతలు తీసుకుంది. టయోటా కిర్లోస్కర్ ఆటో పార్ట్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్లకు మానసి కిర్లోస్కర్ బాధ్యత వహిస్తున్నారు. మానసి టాటా కిర్లోస్కర్ రెండు కంపెనీలకు వైస్ చైర్ పర్సన్ గా ఉన్నారు. కిర్లోస్కర్ టయోటా టెక్ట్స్ టైల్స్, టయోటా ఇంజిన్ లిమిటెడ్, డెన్సో కిర్లోస్కర్ ఇండస్ట్రీస్, టయోటా మెటీరియల్ హ్యాండ్లింగ్ వంటి ఇతర గ్రూప్ కంపెనీల్లో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. యంగ్ బిజినెస్ ఛాంపియన్ అవార్డు కూడా అందుకున్నారు.

మానసి అమెరికాలోని ఫేమస్ రోడ్ ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుంచి ఫైన్ ఆర్ట్స్ లో గ్రాడ్యుయేట్ చేశారు. ఆర్ట్ తో పాటు ట్రావెలింగ్ అంటే ఆమెకు చాలా ఇష్టం. కళాకారిణిగా ప్రతిభ ఉందని ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ ఆమెను ప్రశంసించారు. కళలపై మానసికి ఎంతో గౌరవం ఉంది.

టయోటా మోటార్ కార్పొరేషన్ 1997లో కిర్లోస్కర్ గ్రూప్ తో జాయింట్ వెంచర్ లో భారతదేశంలోకి ప్రవేశించింది. టయోటా మోటార్ కార్పొరేషన్ కు 89 శాతం, కిర్లోస్కర్ గ్రూపునకు 11 శాతం వాటా ఉంది. టయోటా కొన్ని ప్రసిద్ధ కార్లలో ఇన్నోవా హైక్రాస్, ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్, లెజెండర్ ఉన్నాయి. మీడియా నివేదికల ప్రకారం టయోటా కిర్లోస్కర్ మోటార్స్ మార్కెట్ క్యాప్ రూ .13000 కోట్లకు పైగా ఉంది.