ENG vs IND Akash Deep: తొలి టెస్ట్ లో టీమిండియా విధించిన భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండు చేదించడంలో ముఖ్యపాత్ర పోషించినవాడు డకెట్. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసి.. టీమ్ ఇండియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఏమాత్రం కనికరం లేకుండా పరుగులు చేసి అదరగొట్టాడు. అంతేకాదు తన జట్టుకు భారీ విజయాన్ని అందించి ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో అతనిపై ఇంగ్లాండ్ జట్టు మేనేజ్మెంట్ భారీ అంచనాలు పెట్టుకుంది. రెండవ టెస్టులోనూ దుమ్ము రేపు తాడని భావించింది. టీమిండియా 587 పరుగులు చేసిన నేపథ్యంలో.. అతడు దీటుగా బ్యాటింగ్ చేస్తాడని అంచనా వేసింది. కానీ ఇంగ్లాండ్ జట్టు పెంచుకున్న ఆశలు.. వేసుకున్న అంచనాలు అన్నీ తలకిందులయ్యాయి. తొలి టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో డకెట్ 149 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ జట్టును గెలిపించాడు. రెండవ టెస్టు విషయానికి వచ్చేసరికి అతడు విఫలమయ్యాడు.
Also Read: వహ్వా గిల్..చెప్పినట్టుగానే కసి కొద్దీ ఆడాడు.. డబుల్ సెంచరీ సాధించాడు..
ఇంగ్లాండ్ జట్టు తరుపున ఓపెనర్ గా వచ్చాడు డకెట్. ఐదు బంతులు ఎదుర్కొన్న అతడు ఒక పరుగు కూడా చేయలేకపోయాడు. ఆకాష్ దీప్ బౌలింగ్ లో స్లిప్ లో ఉన్న కెప్టెన్ గిల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తొలి టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో 149 పరుగులు చేసిన అతడు.. రెండో టెస్టులో మాత్రం గోల్డెన్ డక్ గా వెనుతిరిగాడు.. దీంతో 13 పరుగుల వద్ద ఇంగ్లాండ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మరుసటి బంతికి పోప్ (0) కూడా అవుట్ అయ్యాడు. స్లిప్ లో కేఎల్ రాహుల్ పట్టిన క్యాచ్ కు పోప్ వెను తిరిగాడు. దీంతో 13 పరుగుల వద్ద ఇంగ్లాండ్ జట్టు 2 వికెట్లు కోల్పోయింది. ఇక ఇదే క్రమంలో మరో బౌలర్ సిరాజ్ అత్యంత ప్రమాదకరమైన క్రావ్లీ(19) వెనక్కి పంపించాడు..క్రావ్లీ కొట్టిన బంతిని కరుణ్ నాయర్ అద్భుతంగా అందుకున్నాడు.. దీంతో ఇంగ్లాండ్ జట్టు 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.. ఈ దశలో వచ్చిన హ్యరీ బ్రూక్, రూట్ సమయోచితం గా బ్యాటింగ్ చేస్తున్నారు. టీమ్ ఇండియా బౌలర్లలో ఆకాశ్ రెండు, సిరాజ్ ఒక వికెట్ సాధించారు.
ఈ మ్యాచ్ లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 587 పరుగులు చేసింది. టీమిండియా సారథి గిల్ డబుల్ సెంచరీ చేశాడు. 269 పరుగులు చేసిన అతడు టంగ్ బౌలింగ్లో ఔటయ్యాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చిన అతడు అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. రవీంద్ర జడేజాతో డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వాషింగ్టన్ సుందర్ తో శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తద్వారా ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. తొలి టెస్ట్ ఓటమి నుంచి త్వరగానే బయటపడిన గిల్.. జట్టు భారాన్ని మొత్తం భుజాలకు వేసుకున్నాడు. కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చిన అతడు.. జట్టును అత్యంత పటిష్ట స్థితిలో నిలిపి వెళ్ళాడు. అందువల్లే భారత్ ఆ స్థాయిలో స్కోర్ చేయగలిగింది. ఒకరకంగా రెండవ టెస్టు మీద పట్టు బిగించింది.
Centurions of the 1st Test – Duckett and Pope dismissed on ducks.
Courtesy – Akashdeep. ♂️ pic.twitter.com/sFlXY5y2Fd
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 3, 2025