Nithin Thammudu Movie Twitter Review: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో డీలాపడిన ప్రముఖ యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘తమ్ముడు’ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలైంది. ఈ సినిమా పై నితిన్ అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు. ఎందుకంటే డైరెక్టర్ వేణు శ్రీరామ్ మినిమం గ్యారంటీ కంటెంట్ ఇచ్చే దర్శకుడు. పైగా నిర్మాత దిల్ రాజు ప్రతీ ప్రమోషనల్ ఈవెంట్ లో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని బలమైన నమ్మకం తో మాట్లాడాడు. నెల రోజుల క్రితం విడుదలైన థియేట్రికల్ ట్రైలర్, మొన్న రిలీజ్ ట్రైలర్ ఆడియన్స్ కి కథ ఏంటో పెద్దగా అర్థం కాకపోయినా, ఎదో తీశాడు లే, మినిమం గ్యారంటీ అనే విధమైన కలిగింది. కానీ ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కి ఏ మాత్రం ఉపయోగపడలేదు. ప్రపంచవ్యాప్తంగా కనీసం కోటి రూపాయిల గ్రాస్ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రాలేదు.
#Thammudu A Lackluster Action-Adventure Drama That Tests Your Patience from start to finish!
Director Venu Sriram attempts to deliver a unique action-adventure film with an interesting backdrop. However, he completely fails. The on-screen proceedings are outright silly at…
— Venky Reviews (@venkyreviews) July 4, 2025
ఇది నిర్మాత దిల్ రాజు కి చాలా పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ సినిమా కోసం ఆయన దాదాపుగా 70 కోట్ల రూపాయిలు ఖర్చు చేసాడు. మీడియం రేంజ్ హీరోలలో భారీ బడ్జెట్ చిత్రం ఇదే అనుకోవచ్చు. అయితే నేడు విడుదలైన ఈ సినిమాకు ట్విట్టర్ నుండి ఘోరమైన నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి. డైరెక్టర్ వేణు శ్రీరామ్ చాలా యూనిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రాన్ని తీసే ప్రయత్నం చేశాడని,అందుకోసం ఆసక్తికరమైన బ్యాక్ డ్రాప్ ని కూడా ఎంచుకున్నాడని, కానీ స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా నడిపించడం ఘోరంగా విఫలం అయ్యాడని అంటున్నారు. అక్కడ తమ్ముడు మధ్య ఎమోషన్స్ అసలు పండలేదట. విలన్ క్యారక్టర్ బాగానే డిజైన్ చేసుకున్నారు కానీ, చివరికి ఆ క్యారక్టర్ ని కూడా కామెడీ చేసేసారు అంటూ చెప్పుకొచ్చారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పర్వాలేదు అని అనిపించే రేంజ్ లో ఉందట.
Below average film. Apart from two fight sequences, the film is boring in the second half.
The issue with #Thammudu is the lack of emotion and the brother/sister emotion doesn’t work. The choreography for action sequences which is important for this film could’ve been much…
— Sharat chandra (@Sharatsays2) July 4, 2025
సెకండ్ హాఫ్ లో ఒక సన్నివేశం లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ లో ఉందని, సినిమా మొత్తం మీద వేణు శ్రీ రామ్ ఆ ఒక్క సన్నివేశాన్ని బాగా రాసుకున్నది అంటున్నారు. దీంతో పాపం నితిన్ అభిమానులు మరోసారి తీవ్రమైన నిరాశకు గురయ్యారు. రాబిన్ హుడ్ చిత్రమే ఘోరమైన డిజాస్టర్ అనుకుంటే, ఈ సినిమా అంతకు మించిన డిజాస్టర్ అయ్యేలా ఉందని ట్వీట్స్ వేస్తున్నారు. రాబిన్ హుడ్ చిత్రం లో కమర్షియల్ ఆడియన్స్ ని అలరించే విధంగా ‘అది దా సర్ప్రైజ్’ లాంటి బ్లాక్ బస్టర్ సాంగ్ ఉందని, కానీ తమ్ముడు లో అవి కూడా లేవని అంటున్నారు. ‘కుబేర’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న టాలీవుడ్ కి , ఆ తర్వాత కన్నప్ప పర్వాలేదు అని అనిపించే రేంజ్ ఓపెనింగ్ ని సంపాదించుకుంది. కానీ ఇప్పుడు ‘తమ్ముడు’ రూపం లో మాత్రం భారీ డిజాస్టర్ ఫ్లాప్ ని మూటగట్టుకుంది అంటూ వాపోతుంది ట్రేడ్. ట్విటర్ ఆడియన్స్ నుండి ఎలాంటి రియాక్షన్ వచ్చిందో మీకోసం అందిస్తున్నాము చూడండి.
#Thammudu routine metta mass formula..! #review not sure what the director was trying to convey bc..!!
— Abilash Reddy (@abilashredy) July 4, 2025
#Thammudu ::
నితిన్ కథలు ఆయన వింటారో లేదో మరి ఎవరు వింటారో కాని వారికి.. @actor_nithiin pic.twitter.com/qHlSMZyOoY
— తార-సితార (@Tsr1257) July 4, 2025
Review: #Thammudu Dare if you can. #Nithiin #VenuSriram #Dilraju pic.twitter.com/du7ihiG5Go
— The Cine Gossips (@TheCineGossips) July 4, 2025