Today 4 July 2025 Horoscope: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. శుక్రవారం ద్వాదశ రాశులపై చిత్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు. వ్యాపారులో కొన్ని చిక్కుల నుంచి బయటపడతారు. ఈరోజు రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈ రోజు ప్రజలతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని అనవసరమైన చర్చల్లో పాల్గొనకుండా ఉండడమే మంచిది. పెండింగ్ పనులను పూర్తి చేయడానికి చాలా కష్టపడతారు. కానీ అవి అసంపూర్తిగానే ఉంటాయి. చట్టపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంది. అందువల్ల అనవసరమైన వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. వ్యాపారులకు లాభాలు ఉండలు ఉన్నాయి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అనుకూలమైన వాతావరణ ఉంటుంది. కార్యాలయాల్లో కొత్త ప్రాజెక్టులను చేపడతారు. వీటిని పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. కొత్తగా పెట్టుబడును పెట్టాల్సివస్తే పెద్దల సలహా తీసుకోవాలి. విద్యార్థులు మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయితే గురువుల సలహాతో వీరు కొన్ని పోటీ పరీక్షల్లో పాల్గొంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వ్యాపారులు ఈరోజు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారంలో కొత్త వ్యక్తులను నమ్మకుండా ఉండాలి. ఎవరైనా డబ్బు సహాయం అడిగితే చేయవచ్చు. ఎందుకంటే ఆ డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనుకోకుండా ప్రయాణాలు చేయగలుగుతారు. వ్యాపారులకు ఊహించిన లాభాలు ఉంటాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : కన్య రాశి వారు ఏ రోజు అదనపు ఆదాయాన్ని పొందుతారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. దీంతో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. ముఖ్యమైన పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. కొత్త ప్రాజెక్టులను చేపడతారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : కొందరు వ్యాపారులకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. అయితే వీరి నుంచి చాకచక్యంగా తప్పించుకోవడానికి ప్రయత్నించాలి. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉంటుంది. కానీ అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. కొత్త పనులు ప్రారంభించడానికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. కానీ ప్రస్తుతానికి అనువైన సమయం కాదు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. కొందరు మోసం చేసే అవకాశం ఉంది. విద్యార్థుల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయకుండా ఉండడమే మంచిది. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఉత్సాహం చూపిస్తారు. అయితే తోటి వారి మద్దతును కూడగట్టుకుని ప్రయత్నం చేయాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారు ఈ రోజు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారులకు మెరుగైన లాభాలు ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. అయితే ఈరోజు చేపట్టే కొన్ని పనులు పూర్తికావడానికి కష్టపడాల్సి వస్తుంది. కొన్ని విషయాలను ఇతరులకు చెప్పకుండా ఉండాలి. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఉద్యోగులు అనుకున్న పనులు పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొందరు పదోన్నతి పొందే అవకాశం కూడా ఉంది. వ్యాపారులకు ఈరోజు మెరుగైన లాభాలు ఉండలు ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం వాహనదంగా ఉండనుంది. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాల్సి వస్తే తిరిగి వస్తుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : చట్టపరమైన చెక్కులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఆస్తుల విషయంలో సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు వ్యాపారులకు శత్రువుల బెడద ఉండనుంది. అందువల్ల ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉండడంతో కొన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. అదనపు ఆదాయం పొందేందుకు ఏర్పాటు అవుతుంది. కొందరు వీరిపై ఆధిపత్యం చేయాలా ఈంచడానికి ప్రయత్నిస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు ప్రమోషన్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మానసిక సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉండలు ఉన్నాయి. కుటుంబంలో ఒకరికి అనారోగ్యం ఉండే అవకాశం ఉంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు ఉల్లాసంగా ఉండగలుగుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం తీవ్రంగా కృషి చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పాత స్నేహితులను కలవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెడతారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాలి.