WPL 2024: బ్రేక్ ద గ్లాస్.. బ్రేక్ ద హార్ట్.. ఈ లేడీ తుఫాన్ క్రికెటర్ కు ఊహించని బహుమతిచ్చారు

వుమెన్స్ ప్రీమియర్ లీగ్ లో బెంగళూరు జట్టు ఫైనల్ దాకా వెళ్ళింది అంటే దానికి కారణం ఎలిస్ ఫెర్రీ. ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై పై ఆ క్రీడాకారిణి ఆకాశమే హద్దుగా అన్నట్టుగా చెలరేగింది.

Written By: Anabothula Bhaskar, Updated On : March 17, 2024 8:52 am

WPL 2024

Follow us on

WPL 2024: అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడితే.. జట్టును కష్టాల్లో ఉన్నప్పుడు విజయతీరాలకు మళ్లిస్తే.. ఏ క్రీడాకారిణికైనా విలువైన బహుమతి ఇస్తారు. కానీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఎలిమినేటర్ మ్యాచ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ఓ క్రీడాకారిణికి టాటా కంపెనీ ఓ అరుదైన బహుమతి ఇచ్చింది. ఇంతకీ ఆ క్రీడాకారిణి ఎవరో? ఆ బహుమతి ఏమిటో? ఈ కథనంలో తెలుసుకుందాం.

వుమెన్స్ ప్రీమియర్ లీగ్ లో బెంగళూరు జట్టు ఫైనల్ దాకా వెళ్ళింది అంటే దానికి కారణం ఎలిస్ ఫెర్రీ. ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై పై ఆ క్రీడాకారిణి ఆకాశమే హద్దుగా అన్నట్టుగా చెలరేగింది. ఆమె దూకుడైన ఆటతో ముంబై జట్టు పై బెంగళూరు 5 వికెట్ల తేడాతో గెలిచి కప్ కు అడుగు దూరంలో నిలిచింది.. ఈ మ్యాచ్ లో ఫెర్రీ 50 బంతుల్లో 66 పరుగులు చేసింది. ఆమె ఆ స్థాయిలో ఆడకపోతే బెంగళూరు జట్టు ఇంటిదారి పట్టాల్సి వచ్చేది. బ్యాటింగ్ మాత్రమే కాకుండా బౌలింగ్ లోను ఒక వికెట్ తీసి ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం అందుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ లో టాటా కంపెనీ ఫెర్రీ కి ఇచ్చిన పురస్కారమే చర్చనీయాంశంగా మారింది.

ఎలిమినేటర్ మ్యాచ్ కాకుండా అంతకు ముందు జరిగిన ఒక మ్యాచ్లో ఫెర్రీ ఓ భారీ సిక్సర్ బాదింది. ఆమె కొట్టిన దెబ్బకు బంతివెళ్లి కారుకు తగలడంతో దాని అద్దాలు పగిలాయి.. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్ గా టాటా కంపెనీ వ్యవహరిస్తున్న నేపథ్యంలో.. టాటా పంచ్ కారును ప్రమోషన్స్ కు ఉంచుతోంది… ఫెర్రీ కొట్టిన బంతి నేరుగా వెళ్లి తగలడంతో టాటా పంచ్ కారు ఫ్రంట్ డోర్ అద్దాలు పగిలాయి. అప్పట్లో ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొట్టింది.

ఫెర్రీ బలంగా కొట్టడం వల్లే అద్దాలు పగిలిపోయాయని భావించిన టాటా కంపెనీ.. పగిలిపోయిన గ్లాస్ ను ఫ్రేమ్ కట్టించి ఎలిమినేటర్ మ్యాచ్ ముగిసిన అనంతరం ఫెర్రీ కి ప్రత్యేక బహుమతిగా అందించింది.. నాణ్యమైన ఉత్పత్తులు, భద్రత విషయంలో రాజీ పడని టాటా కంపెనీ కార్ గ్లాస్ ను.. తను కొట్టిన బంతి ద్వారా పగలగొట్టిన ఫెర్రీస్ పై టాటా కంపెనీ ప్రశంసలు కురిపించింది.

ఉత్తరప్రదేశ్ వారియర్స్ తో వుమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా మార్చి 4న బెంగళూరు జట్టు మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో ఫెర్రీ భారీ సిక్స్ కొట్టింది. ఆమె కొట్టిన కొట్టుడు బంతి నేరుగా వెళ్లి టాటా పంచ్ కార్ విండో ఫ్రంట్ గ్లాస్ ను బలంగా తగిలింది. దీంతో కారు అద్దాలు పగిలిపోయాయి. ఉత్తరప్రదేశ్ బౌలర్ దీప్తి శర్మ వేసిన 19 ఓవర్ లో ఫెర్రీ ఈ ఘనత సాధించింది. ఫెర్రీ బ్యాటింగ్ ధాటికి 80 మీటర్ల ఎత్తు నుంచి వెళ్లిన బంతి కారు విండో ఫ్రంట్ గ్లాసును బద్దలు కొట్టింది. ఫెర్రీ బ్యాటింగ్ ను మెచ్చుకుంటూ టాటా కంపెనీ ఆమె పగలగొట్టిన గ్లాసును ఫ్రేమ్ చేసి మ్యాన్ ఆఫ్ ది వుమెన్ పురస్కారం కింద బహుమతిగా అందించింది.. అయితే ఈ బహుమతి ఇవ్వడం పట్ల నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడితే ఇలాంటి బహుమతి ఇస్తారా? అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.