https://oktelugu.com/

Fateh Teaser: 40 కాదు 50 మందిని వేసేశా.. రిప్‌.. సోనుసూద్‌ ఫతే టీజర్‌ అదుర్స్‌!

ఫతే సినిమా టీజర్‌ విషయానికి వస్తే తొలి డైలాగ్‌ తక్కువగా అంచనా వేయకు అనే ట్యాగ్‌ లైన్‌తో ప్రారంభం అవుతుంది. ఓ బుల్లెట్‌ కింద పడుతుండగా టీచర్‌ మొదలవుతుంది. ఇక ఈ సినిమాలో సోనూసూద్‌ పేరు ఫతేగా టీజర్‌ చూడగానే అర్థమవుతుంది.

Written By:
  • Gopi
  • , Updated On : March 17, 2024 / 08:35 AM IST

    Fateh Teaser

    Follow us on

    Fateh Teaser: సోనుసూద్‌.. ఈ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు అరుంధతిలో విలన్‌ గుర్తొస్తాడు. తర్వాత కరోనా సమయంలో పేదలకు అండగా నిలిచిన మనిషి రూపంలో ఉన్న దేవుడు గుర్తొస్తాడు. దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరాధ్య దైవంగా నిలిచాడు. తనకు లభించిన ఇమేజ్‌తో ప్రస్తుతం నటుడిగానే కాదు దర్శకుడిగా కూడా కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. స్వీయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్, శక్తిసాగర్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఫతే. ఈ సినిమాకు సోనాలి సూద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ మర్చి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    డైరెక్టర్‌ కం యాక్టర్‌..
    ఈ సినిమా టీజర్‌ గురించి రివ్యూ వివరాల్లోకి వెళితే బలవంతంగా లిప్‌లాక్‌.. ఊపిరి ఆగిపోయే కౌగిలి, స్టార్‌ హీరోకు 8 నెలల జైలు శిక్ష.. ఈ సినిమాకు సోనూసూద్‌ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్నారు. ఇందులో జ్వాక్వలైన్‌ ఫెర్నాండేజ్, శివజ్యోతి రాజ్‌పుత్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలో అదిరిపోయే యాక‌్షన్‌ సీన్లు ఉన్నాయని సమాచారం. ఈ సినిమాకు హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ లీ విటాకర్‌ పనిచేశారు. ఇక ఈ సినిమాను ఎక్కువ శాతం ఇండియా, రష్యా, అమెరికా, పోలండ్‌లో షూట్‌ చేశారు. స్పై, యాక‌్షన్‌ థ్రిల్లర్‌గా సినిమాను సోనుసూద్‌ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

    తక్కువగా అంచనా వేయకు..
    ఇక ఫతే సినిమా టీజర్‌ విషయానికి వస్తే తొలి డైలాగ్‌ తక్కువగా అంచనా వేయకు అనే ట్యాగ్‌ లైన్‌తో ప్రారంభం అవుతుంది. ఓ బుల్లెట్‌ కింద పడుతుండగా టీచర్‌ మొదలవుతుంది. ఇక ఈ సినిమాలో సోనూసూద్‌ పేరు ఫతేగా టీజర్‌ చూడగానే అర్థమవుతుంది. టీజర్‌లో మార్చి 19న నువ్వు 40 మందిని చంపేశావు.. అని ఓ వ్యక్తి గొంతు వినిపిస్తుంది. 40 కాదు.. 50 మంది.. అందులో పది మంది శవాలు మీకు ఎప్పటికీ దొరవకు అంటూ సోనుసూద్‌ వాయిస్‌తో డైలాగ్‌ వినిపించి టీజర్‌పై ఆసక్తి పెంచారు. ఇక సోనూసూద్‌(ఫతే) డైలాగ్‌కు స్పందించిన అవతలి వ్యక్తి 50 మందిని చంపిన నీవు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని ప్రశ్నిస్తాడు. మళ్లీ సోనూసూద్‌ వాయిస్‌తో వారందరికీ భగవంతుడు శాంతిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా అని సమాధానం వస్తుంది. అవతలి వ్యక్తి.. నీవు చేసిన పని సరైందే అని సమర్థించుకుంటున్నావా అని ప్రశ్నిస్తుంది. కథా నాయకుడు సోనుసూద్‌ తన చేతిలోకి రెండు పిస్టల్స్‌ తీసుకుని నడుచుకంటూ వస్తాడు. ఎవడైతే పుట్టాడో.. వాడు చావడం తథ్యం అదే సృష్టి రహస్యం అంటూ చెప్పిన డైలాగ్‌, సీన్‌ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది.

    ఫైట్‌, ఛేజంగ్‌ సీన్లు..
    ఇక టీజర్‌లో మరో కీలక డైలాగ్‌ కూడా ఉంది. సోనూసూద్‌తో అవతలి వ్యక్తి మాట్లాడుతూ ఆరోజు నీవు ఓ యువతితో ఉన్నావా? అని ప్రశ్నిస్తాడు. దీనికి హీరో… లేదు.. ఆమెనే నాతో ఉంది అని సమాధానం ఇస్తాడు. ఇక చివర్లో టీజర్‌లో చూపించిన యాక్షన్‌ సీన్లు, ఫైట్స్, ఛేజింగ్‌ సీన్లు కేక పెట్టించాయి. 2024లో ఈ సినిమా రిలీజ్‌ అవుతున్నది. మీరు సిద్దంగా ఉండండి అంటూ క్రేజీ న్యూస్‌ అందించారు.