Homeక్రీడలుAustralian Open 2026: వరల్డ్ నెంబర్ వన్ కే షాక్.. ఎవరీ ఎలైనా రైబకినా?

Australian Open 2026: వరల్డ్ నెంబర్ వన్ కే షాక్.. ఎవరీ ఎలైనా రైబకినా?

Australian Open 2026: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో అద్భుతం చోటుచేసుకుంది. ఈ ఏడాది మహిళల సింగిల్స్ విజేతగా కజకిస్తాన్ బ్యూటీ ఎలైనా రైబకినా ఆవిర్భవించింది. ఫైనల్ పోటీలో టాప్ సీడ్ అరీనా సబలెంకా ను ఓడించింది. ఐదవ సీడ్ గా కొనసాగుతున్న ఎలైనా రైబకినా అద్భుతమైన పోరాటాన్ని చేసింది. అనితర సాధ్యమైన విజయాన్ని అందుకొని సబ లెంకా కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. అంతేకాదు తన టెన్నిస్ కెరీర్లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ట్రోఫీని అందుకుంది.

ఎలైనా రైబకినా తన కెరియర్ లో రెండవ గ్రాండ్ స్లామ్ ఇది. 2022లో జరిగిన వింబుల్డన్ లో ఎలైనా రైబకినా విజేతగా నిలిచింది. 2023లో ఎలైనా రైబకినా ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఫైనల్ దాకా వెళ్ళింది. అయితే నాడు సబ లెంకా చేతిలో ఓటమిపాలైంది. నాటి ఓటమికి ఎలైనా రైబకినా సరైన స్థాయిలో బదులు తీర్చుకుంది.

కజకిస్తాన్ దేశానికి చెందిన ఎలైనా రైబకినా కు చిన్నప్పటి నుంచి టెన్నిస్ అంటే చాలా ఇష్టం. అందువల్లే ఆమె ఈ స్థాయిలో సత్తా చూపిస్తోంది. ఓటములు ఎదురైనప్పటికీ.. కొన్ని సందర్భాలలో ట్రోఫీలకు దగ్గరగా వచ్చి ఓడిపోయినప్పటికీ.. ఏమాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. అందువల్లే ఆమె ఈ స్థాయిలో నిలబడగలిగింది. ఆస్ట్రేలియన్, వింబుల్డన్ ట్రోఫీలను గెలుచుకున్న ఆమె తన తదుపరి లక్ష్యం ఫ్రెంచ్ ఓపెన్ అని చెబుతోంది.. అది గనక గెలుచుకుంటే ప్రతిష్టాత్మకమైన మూడు గ్రాండ్ స్లామ్ ట్రోఫీలు తన ఖాతాలో చేరుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. ఫ్రెంచ్ ఓపెన్ ను దృష్టిలో పెట్టుకొని ఇకపై తన ప్రాక్టీస్ ఉంటుందని ఆమె పేర్కొంది.

ఆస్ట్రేలియన్ ఓపెన్ లో విజేతగా నిలవడం ద్వారా
ఎలైనా రైబకినా కు ఏకంగా 25.25 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. ఈ గెలుపు ద్వారా ఎలైనా రైబకినా తన కెరియర్లో మూడవ ర్యాంకు కు చేరుకుంది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ ఏకంగా రెండు గంటల 18 నిమిషాల పాటు సాగింది. మూడో సెట్ లో 0 తో వెనుకబడిపోయినప్పటికీ.. ఎలైనా రైబకినా పుంజుకుంది.. వరుస గేమ్ లు సొంతం చేసుకుంది. మ్యాచ్ గెలిచి ట్రోఫీని అందుకుంది. ఈ ఓటమితో సబ లెంకా మైదానంలో ఏడ్చింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular