https://oktelugu.com/

క్రికెటర్లకు ‘ముచ్చెమటలు’ పట్టిస్తున్న దుబాయ్‌ వెదర్‌‌

దేశంలో కరోనా విజృంభిస్తుండడంతో.. ఈసారి మన దేశంలో జరగాల్సిన ఐపీఎల్‌ దుబాయికి షిఫ్ట్ అయింది. క్రికెట్‌ మ్యాచ్‌లు చూస్తూ ప్రేక్షకులు ఆనందపడుతున్నా.. క్రికెటర్లలో మాత్రం ‘ఇదేం దుబాయిరా బాబోయ్‌’ అనే ఫీలింగ్‌ కనిపిస్తోంది. ఎందుకంటారా.. అక్కడి వాతావరణం. అటు ప్రేక్షకులు లేక చిన్నబోతున్న స్టేడియంలు.. క్రికెటర్లకు వాతావరణం కూడా సహకరించడం లేదు. Also Read: ధోనికి ఏమైంది.. ఫ్యాన్స్ లో టెన్షన్..! దుబాయ్‌లోని వాతావరణం ఇప్పుడు  క్రికెటర్లను ఆందోళన కలిగిస్తోంది. ఆ దేశంలో సీతాకాలం ఎఫెక్ట్‌ అప్పుడే […]

Written By:
  • NARESH
  • , Updated On : October 4, 2020 / 11:09 AM IST
    Follow us on

    దేశంలో కరోనా విజృంభిస్తుండడంతో.. ఈసారి మన దేశంలో జరగాల్సిన ఐపీఎల్‌ దుబాయికి షిఫ్ట్ అయింది. క్రికెట్‌ మ్యాచ్‌లు చూస్తూ ప్రేక్షకులు ఆనందపడుతున్నా.. క్రికెటర్లలో మాత్రం ‘ఇదేం దుబాయిరా బాబోయ్‌’ అనే ఫీలింగ్‌ కనిపిస్తోంది. ఎందుకంటారా.. అక్కడి వాతావరణం. అటు ప్రేక్షకులు లేక చిన్నబోతున్న స్టేడియంలు.. క్రికెటర్లకు వాతావరణం కూడా సహకరించడం లేదు.

    Also Read: ధోనికి ఏమైంది.. ఫ్యాన్స్ లో టెన్షన్..!

    దుబాయ్‌లోని వాతావరణం ఇప్పుడు  క్రికెటర్లను ఆందోళన కలిగిస్తోంది. ఆ దేశంలో సీతాకాలం ఎఫెక్ట్‌ అప్పుడే స్టార్ట్‌ అయింది. రాత్రి వేళలో మంచు కురుస్తోంది. డ్యూ ఫ్యాక్టర్ వల్ల చేతుల్లోంచి బంతులు జారిపోతున్నాయి. క్యాచ్‌లు నేల పాలవుతున్నాయి. అందుకే టాస్ గెలిచిన‌వాళ్లంతా తొలుత బౌలింగ్ తీసుకుంటున్నారు.

    అయితే.. ఓ వైపు మంచు పడుతున్నా కూడా ఆ స్థాయిలో వేడితో ఉక్కపోత కూడా ఉంది. బంతులు జారీపోతుండగా.. ప్లేయర్స్‌ కూడా డీ హైడ్రేషన్‌కు గురవుతున్నారు. అటు బ్యాంటింగ్‌ చేసే వారు.. ఇటు బౌలర్లకూ ముచ్చెమటలు పడుతున్నాయి. ఎంత మంచి సీనియర్‌‌ ప్లేయర్స్‌ అయినా నాలుగు ఓవర్లు ఆడేసిరికే చెమటలతో తడిసి ముద్దైపోతున్నారు.

    Also Read: చెన్నైతో రైనా.. భజ్జీ బంధానికి తెరపడనుందా?

    ధోనీ కూడా మొన్నటి మ్యాచ్‌లో వికెట్ల మధ్య పరుగులు పెట్టలేకపోయాడు.డీ హైడ్రేష‌న్‌తో బాధ ప‌డ్డాడు. ధోనీ అలాంటి నీరసం ఇన్ని రోజుల్లో ఎప్పుడూ కనిపించలేదు. వ‌య‌సు మీద ప‌డుతున్నా ఫిట్‌నెస్ విష‌యంలో ధోనీ ఎవరికీ తీసిపోడు. కానీ.. దుబాయ్‌లో వాతావ‌ర‌ణం ధోనీ లాంటి వాడ్ని సైతం ఇబ్బంది పెడుతోంది. యువ ఆట‌గాడు కిష‌న్ కూడా అంతే డీ హైడ్రేష‌న్‌తో సూప‌ర్ ఓవ‌ర్‌‌లో బ్యాటింగ్‌కు రాలేక‌పోయాడు. అది ముంబై జ‌ట్టుపై విప‌రీత‌మైన ప్రభావం చూపింది. తీరా మ్యాచ్‌ను బెంగ‌ళూరుకు స‌మ‌ర్పించుకున్నారు. డీవిలియ‌ర్స్ సైతం డీ హైడ్రేష‌న్ బారిన ప‌డిన‌వాడే. మ్యాచ్‌ గెలిచాక కూడా కనీసం మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు తీసుకునేందుకు రావడానికి కూడా అతనికి ఓపిక లేకుండా పోయింది. అత‌ని స్థానంలో కోహ్లీని పంపించాడు. దుబాయ్‌లో ఆటగాళ్లు ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.