https://oktelugu.com/

‘నిశ్శబ్ధం’ ఫ్లాప్ కు ఆయనే కారణమా?

కోన వెంకట్ టాలీవుడ్లోకి మాటల రచయిత ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా(విలన్).. డైరెక్టర్.. ప్రొడ్యూసర్ గా మారారు. కోన వెంకట్ నిర్మాతగా ఇండస్ట్రీలో మంచిపేరు తెచ్చుకున్నారు. కేవలం తన మాటకారితనం.. పరిచయాలతో తన బ్యానర్లో సినిమాలు చేయడం కోన వెంకట్ స్పెషాలిటీ. Also Read: బిగ్ బాస్ కాదు బ్యాడ్ బాస్.. అన్యాయంగా ఇద్దరి ఎలిమినేషన్..? కోనవెంకట్ కెరీర్ తొలి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కోన వెంకట్ నిర్మించిన తొలి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 4, 2020 / 11:16 AM IST
    Follow us on


    కోన వెంకట్ టాలీవుడ్లోకి మాటల రచయిత ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా(విలన్).. డైరెక్టర్.. ప్రొడ్యూసర్ గా మారారు. కోన వెంకట్ నిర్మాతగా ఇండస్ట్రీలో మంచిపేరు తెచ్చుకున్నారు. కేవలం తన మాటకారితనం.. పరిచయాలతో తన బ్యానర్లో సినిమాలు చేయడం కోన వెంకట్ స్పెషాలిటీ.

    Also Read: బిగ్ బాస్ కాదు బ్యాడ్ బాస్.. అన్యాయంగా ఇద్దరి ఎలిమినేషన్..?

    కోనవెంకట్ కెరీర్ తొలి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కోన వెంకట్ నిర్మించిన తొలి సినిమా ‘తోకలేనిపిట్ట’ ప్లాప్ అయింది. దీంతో ఆయన ఆర్థికంగా చాలా ఇబ్బందులుపడ్డారు. ఆ తర్వాత రచయితగా కొనసాగారు. ఆ తర్వాత డైరెక్టర్ గా మారిన ఆయనకు పెద్దగా కలిసిరాలేదు. దీంతో ఆయన సొంతంగా బ్యానర్ స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నారు

    కొన వెంకట్ కేవలం మాటకారితనంతోనే సినిమాలను సెట్ చేస్తూ వస్తున్నారు. కోనవెంకట్ తానే సొంతంగా సినిమాకు ప్రొడ్యూసర్ చేయకుండా ఇతర నిర్మాతలతో సంయుక్తంగా నిర్మిస్తూ లాభాలు గడిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆయన నిర్మాణంలో వస్తున్న సినిమాలేవి పెద్దగా ఆడటం లేదు.

    తాజాగా కోన వెంకట్ ‘నిశబ్ధం’ మూవీని టీజీ విశ్వప్రసాద్.. వివేక్ కూచిబొట్లతో సంయుక్తంగా నిర్మించారు. హర్రర్.. థ్రిల్లర్ జోనర్లో నిర్మించిన ‘నిశబ్ధం’ మూవీలో అనుష్కశెట్టి ప్రధాన పాత్రలో నటించింది. మాధవన్.. అంజలి.. శాలినిపాండే.. అవసరాల శ్రీనివాస్.. సుబ్బరాజు.. మైఖేల్ మ్యాడ్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు.

    Also Read: కరోనా ఎఫెక్ట్: టాలీవుడ్ కీలక నిర్ణయం

    అనుష్క మూగయువతిగా నటించింది. భారీ తారాగాణంతో తెరకెక్కిన ‘నిశబ్ధం’ సినిమా ఇటీవల ఓటీటీలో రిలీజైంది. అయితే ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. కోన వెంకట్ కారణంగానే సినిమాను ఓటీటీలో రిలీజు చేయాల్సి వచ్చిందనే టాక్ విన్పిస్తోంది. ఈ సినిమా థియేటర్లలో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేసినందు వల్లే సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుందనే టాక్ విన్పిస్తోంది.

    ఇటీవల కాలంలో కోన వెంకట్ నిర్మాణం వస్తున్న సినిమాలన్నీ కూడా ప్లాప్ టాక్ తెచ్చుకుంటున్నాయి. తాజాగా నిశబ్ధం కూడా ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఆయన తదుపరి సినిమాలపై ఈ ప్రభావం పడనుంది. కోనవెంకట్ ప్రస్తుతం కరుణం మల్లీశ్వరీ బయోగ్రఫీని తెరకెక్కించే పనిలో ఉన్నారు. నిశబ్ధం ప్లాప్ కావడంతో ఆ ప్రభావం ఈ సినిమాపై పడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.