Team India T20 World cup : టీమిండియా సెమీస్ కు వెళ్లింది. ఇప్పుడు ఇంగ్లండ్ తో నాకౌట్ మ్యాచ్ కు సిద్ధమైంది. ఇలాంటి కీలక సెమీస్ కు ముందు అందరికీ విశ్రాంతి అవసరం. ముఖ్యంగా మన బౌలర్లు ఫిట్ గా, విశ్రాంతిగా ఉండడం చాలా ముఖ్యం. కానీ ఆస్ట్రేలియా లాంటి పెద్ద ఉపఖండంలో ప్రయాణాలు పెను భారమవుతున్నాయి. మన దేశంలో ఒకే సమయం ఉంటుంది. కానీ ఆస్ట్రేలియా దేశంలో మూడు సమయాలు (కాలాలు) ఉంటాయి. తూర్పున మెల్ బోర్న్ నుంచి సిడ్నీ, పశ్చిమాన పెర్త్ వరకూ వచ్చేసరికి 4 గంటలు తేడా ఉంటుంది. అంతటి పెద్ద దేశంలో విమాన ప్రయాణాలకే సగం సమయం ఖర్చు అవుతుంది.

ఈ ప్రయాణిక బడలికను దాటి టీమిండియా ఆటగాళ్లు మైదానంలో గేమ్ ఆడాలి. ఇలాంటి చలి, వేడి, వానాకాల పరిస్థితుల్లో మన బౌలర్లు త్వరగా అలిసిపోతుంటారు. బ్యాటర్ల కంటే వారు తొందరగా గాయపడుతుంటారు. అందుకే సెమీస్ కు ముందు మన బౌలర్లకు రెస్ట్ అవసరం అని భావించిన టీం మేనేజ్ మెంట్ వారిని కాపాడుకునేందుకు రెడీ అయ్యింది.
సెమీస్ రేసు కోసం మెల్ బోర్న్ నుంచి ఆడిలైడ్ వెళ్లేందుకు రెడీ అయిన టీమిండియా సభ్యులకు విమానంలో కేవలం 4 బిజినెస్ క్లాస్ టికెట్లను ఐసీసీ ఇస్తుంది. వీటిని కోచ్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్, సీనియర్ విరాట్ కోహ్లీ తోపాటు మేనేజర్ కు కేటాయించారు. కానీ బౌలర్లకు తగినంత విశ్రాంతి అవసరం అని.. వారు కాళ్లు చాపుకొని పడుకునే బిజినెస్ క్లాస్ లో అయితే విశ్రాంతి లభిస్తుందని భావించి మన కోచ్, కెప్టెన్ , కోహ్లీలు బిజినెస్ క్లాస్ లను వదులుకున్నారు. వాటిని మన బౌలర్లకు కేటాయించారు. ఇదో పెద్ద సంచలనమైంది. మన కోచ్, కెప్టెన్ లు చేసిన పనికి ప్రశంసలు కురుస్తున్నాయి.
T20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాలో విమాన ప్రయాణం భారంగా మారింది. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మరియు బ్యాటింగ్ సూపర్ స్టార్లు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ తాజాగా మన బౌలర్ల కోసం బిజినెస్ సీట్లను వదులుకున్నారు. వాటిని మన బౌలర్లు మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్ , హార్దిక్ పాండ్యాలకు కేటాయించారు. తద్వారా వారికి తగిన విధంగా రెస్ట్ తీసుకోవడానికి.. కాళ్లు చాపుకొని పడుకోవడానికి ఆస్కారం లభిస్తుంది. ఇది ఆటల మధ్య విశ్రాంతి తీసుకోవడానికి కోలుకోవడానికి వారికి సహాయపడింది. ఈ ప్లాన్ చేసిన మన కోచ్, కెప్టెన్ లపై ప్రశంసల జల్లు కురుస్తోంది.