https://oktelugu.com/

Revanth Reddy Jagga Reddy: రేవంత్ రెడ్డిపై మరోసారి జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy Jagga Reddy: రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక మొదట వ్యతిరేకించింది జగ్గారెడ్డినే. రేవంత్ పీసీసీ చీఫ్ వద్దంటూ లేఖ రాసి కాక రేపారు. ఆది నుంచి వ్యతిరేకిస్తున్న జగ్గారెడ్డి తాజాగా మునుగోడులో కాంగ్రెస్ కాసింత ప్రభావం చూపడం రేవంత్ రెడ్డి ఘనత అనడాన్ని జగ్గారెడ్డి తప్పుపట్టారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి రేవంత్ పై సంచలన కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి వచ్చాకే కాంగ్రెస్ కు ఊపు వచ్చిందని.. మునుగోడులో ఆ మాత్రమన్నా […]

Written By: , Updated On : November 7, 2022 / 08:55 PM IST
Follow us on

Revanth Reddy Jagga Reddy: రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక మొదట వ్యతిరేకించింది జగ్గారెడ్డినే. రేవంత్ పీసీసీ చీఫ్ వద్దంటూ లేఖ రాసి కాక రేపారు. ఆది నుంచి వ్యతిరేకిస్తున్న జగ్గారెడ్డి తాజాగా మునుగోడులో కాంగ్రెస్ కాసింత ప్రభావం చూపడం రేవంత్ రెడ్డి ఘనత అనడాన్ని జగ్గారెడ్డి తప్పుపట్టారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి రేవంత్ పై సంచలన కామెంట్స్ చేశారు.

రేవంత్ రెడ్డి వచ్చాకే కాంగ్రెస్ కు ఊపు వచ్చిందని.. మునుగోడులో ఆ మాత్రమన్నా నిలబడిందని ఓ న్యూస్ చానల్ యాంకర్ అడిగిన ప్రశ్నకు జగ్గారెడ్డి రెచ్చిపోయారు. రేవంత్ ఉంటేనే తానుమూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐదు సార్లు గెలిచాడా? అంటూ లైవ్ లోనే చెలరేగిపోయాడు. ఇలా రేవంత్ రెడ్డి పేరు చెప్పి మమ్మల్ని అవమానించవద్దంటూ హితవు పలికాడు.

ఉత్తమ్ కుమార్ ను రేవంత్ రెడ్డి గెలిపించాడా? అంటూ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ లో ఐక్యత లేదనడం కరెక్ట్ కాదని.. బీజేపీలోనూ ఐక్యత లేదని.. వాళ్లు బయటపడరు అంతే అంటూ కామెంట్ చేశారు. టీఆర్ఎస్ లోనూ ఎన్నో లుకలుకలు ఉన్నాయని.. అధికారంలో ఉండబట్టి వాళ్లంతా ఐక్యంగా ఉన్నట్టు నటిస్తున్నారని చెప్పుకొచ్చాడు. అన్ని పార్టీల్లో లుకలుకలు ఉంటాయని.. వారికి చేతకాక మాట్లాడలేరు బయట అంటూ కవర్ చేశారు. నాకు దమ్మున్నది బయట మాట్లాడడానికి అని.. బీజేపీలో మాట్లాడితే వెళ్లగొడతరని.. టీఆర్ఎస్ లో మాట్లాడితే బీఫాం రాదని.. కానీ కాంగ్రెస్ లో ఏమైనా మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని జగ్గారెడ్డి కవర్ చేశాడు.

కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఏం చేసినా తప్పుకాదని.. స్వేచ్ఛ స్వాతంత్ర్యాలున్నా పార్టీ అని.. కొట్టుకున్నా.. తిట్టుకున్నా.. శత్రువులపై అందరం కలిసి దాడి చేస్తామంటూ చెప్పుకొచ్చారు. వ్యూహాత్మకంగా వెళతామని అన్నారు.

LIVE: జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు | MLA Jagga Reddy Sensational Comments On Revanth Reddy | 10TV