IPL 2024: ప్రపంచంలోనే అత్యధిక పాపులారిటీని సంపాదించుకున్న ఒకే ఒక లీగ్ ఐపీఎల్… ఐపిఎల్ లో ఆడడానికి ప్రతి ఒక్క ప్లేయర్ కూడా చాలా ఉత్సాహన్ని చూపిస్తాడు. ఎందుకంటే ఐపీఎల్ లో ఆడితే డబ్బులతో పాటు ఆ ప్లేయర్లకున్న క్రేజ్ కూడా పెరుగుతుందనే ఒకే ఒక కారణంతో ప్రపంచంలో ఉన్న స్టార్ ప్లేయర్లందరు ఈ లీగ్ లో ఆడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే గత 16 సీజన్లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ అసాధారణమైన క్రేజ్ ను సంపాదించుకుంది.
ఇక ఇప్పుడు 17వ సీజన్ కోసం కూడా సర్వం సిద్ధం చేస్తున్నారు. మార్చి నుంచి ఐపీఎల్ ని ప్రారంభించడానికి ప్రయత్నాలు కూడా మొదలు పెడుతున్నారు. ఇక గెలుపు కోసం ప్రతి ప్రాంచైజ్ కూడా భారీ ఎత్తున డబ్బులు ఖర్చుపెడుతు స్టార్ ప్లేయర్లను తీసుకుంటున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఉన్న కెప్టెన్ లలో ఎవరు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ముందుగా లక్నో సూపర్ జాయింట్స్ కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ ఐపిఎల్ ఒక్క సీజన్ కోసం 17 కోట్ల వరకు డబ్బులు తీసుకుంటున్నారు… ఇక రాహుల్ తర్వాత ఢిల్లీ కెప్టెన్ అయిన రిషబ్ పంత్ 16 కోట్లు తీసుకోగా, గత 2 సంవత్సరాల క్రితం కారు యాక్సిడెంట్ కి గురైన పంత్ ఐపీఎల్ 16వ సీజన్ లో ఆడలేదు. ఇప్పుడు 17వ సీజన్ కోసం మళ్ళీ ఫ్రెష్ గా టీమ్ లోకి అడుగు పెట్టబోతున్నాడు…
వీళ్ళిద్దరి తర్వాత ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా బాధ్యతలను తీసుకున్న హార్దిక పాండ్య 15 కోట్ల వరకు తీసుకుంటున్నాడు…ఇక కలకత్తా టీం కెప్టెన్ అయిన శ్రేయాస్ అయ్యర్ 12.25 కోట్లు తీసుకోగా , రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అయిన సంజు సాంశాన్ 12 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోని కూడా 12 కోట్లు తీసుకుంటున్నాడు. ఇక పంజాబ్ టీం కెప్టెన్ అయిన శిఖర్ ధావన్ 8.25 కోట్లు తీసుకోగా, గుజరాత్ టైటాన్స్ కొత్త కెప్టెన్ అయిన శుభ్ మన్ గిల్ 8 కోట్లు, అలాగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం కెప్టెన్ డూప్లేసిస్ 7 కోట్లు, ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కెప్టెన్ అయిన మార్కరం 2.6 కోట్లు తీసుకుంటున్నాడు…