Valentine’s Day: రోజ్ డే ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

పువ్వుల్లో అన్నిటికంటే అత్యంత ఆకర్షణీయమైనది గులాబీ. ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తీకరించేందుకు గులాబీ పూలను ఉపయోగిస్తుంటారు.. గులాబీ అనేది స్వచ్ఛతకు, గాడమైన బంధానికి, అత్యద్భుతమైన సువాసనకు ప్రతీక అని ప్రేమికులు నమ్ముతుంటారు.

Written By: Anabothula Bhaskar, Updated On : February 7, 2024 9:04 am

Valentine's Day

Follow us on

Valentine’s Day: మిగతా నెలలన్నింటికన్నా ఫిబ్రవరి అంటే ప్రేమికులకు చాలా ఇష్టం. అన్నింటికంటే ఫిబ్రవరి 14 అంటే ఇంకా చాలా ఇష్టం. అందుకే ఫిబ్రవరి నెలను ప్రేమికుల నెలగా అభివర్ణిస్తారు. సాధారణంగా మన దేశంలో అయితే ఫిబ్రవరి 14న మాత్రమే ప్రేమికుల దినోత్సవం గా జరుపుకుంటారు. పాశ్చాత్య దేశాలలో మాత్రం వారం పాటు వేడుకలు జరుపుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియా వాడకం పెరిగిన నేపథ్యంలో మనదేశంలో కూడా ప్రేమికులు వారం పాటు వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక వాలెంటెన్స్ డే సెలబ్రేషన్స్ రోజ్ డే తో ప్రారంభమవుతాయి. రోజ్ డే ను ఫిబ్రవరి ఏడున జరుపుకుంటారు. ఇంతకీ ఈ రోజ్ డే ప్రాముఖ్యత ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

పువ్వుల్లో అన్నిటికంటే అత్యంత ఆకర్షణీయమైనది గులాబీ. ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తీకరించేందుకు గులాబీ పూలను ఉపయోగిస్తుంటారు.. గులాబీ అనేది స్వచ్ఛతకు, గాడమైన బంధానికి, అత్యద్భుతమైన సువాసనకు ప్రతీక అని ప్రేమికులు నమ్ముతుంటారు. అందువల్లే తమ మనసుకు నచ్చిన వారికి, తమ గుండెల్లో చోటు సంపాదించిన వారికి గులాబీలను ఇచ్చి వారి మనసును మరింత చూరగొం టారు. ప్రేమికులు గులాబీలు ఇచ్చిపుచ్చుకునే సంస్కృతి ఇప్పటిది కాదు.. పురాతన రోమన్ కాలం నుంచి ఉంది. చాందసవాదం ఉన్న ఆ కాలంలోనూ పువ్వులు ఇచ్చిపుచ్చుకునే వారంటే ఆనాడు ప్రేమికులు తమ ప్రేమ పట్ల.. తమ ప్రేమికుల పట్ల ఎంత ఆరాధన భావంతో ఉండేవారు అర్థం చేసుకోవచ్చు. ఆ కాలంలో గులాబీ పూలను తమ ఆరాధ్య దైవం వీనస్ దేవతతో రోమన్లు పోల్చేవారు. విక్టోరియన్లు కూడా వారి ప్రేమను వ్యక్తీకరించేందుకు గులాబీ పూలను విరివిగా వాడేవారని చరిత్ర చెబుతోంది. రోజ్ డే నేపథ్యంలో ఇచ్చే గులాబీ పూల విషయంలోనూ ప్రేమకు సంబంధించి వ్యక్తీకరణలు ఉన్నాయి.

ఎరుపు గులాబీలు

ప్రేమికుల్లో మెజారిటీ పక్షం ఈ ఎర్ర గులాబీలు ఇచ్చేందుకే ఇష్టపడతారు. తమ భాగస్వామి పట్ల బలమైన, ఇద్దరమైన భావోద్వేగాలను వ్యక్తిగరించేందుకు శక్తివంతమైన మార్గం ఎరుపు గులాబీలే అని నమ్ముతుంటారు. ప్రేమ పట్ల వాగ్దానం చేయడానికి, వారి అనుభూతిని వ్యక్తం చేయడానికి ఈ ఎరుపు రంగు గులాబీలు చిహ్నంగా ఉంటాయని ప్రేమికులు విశ్వసిస్తుంటారు.

పసుపు రంగు గులాబీలు

పసుపు అనే రంగును మనదేశంలో శుభానికి సూచికగా వాడితే.. ఇతర దేశాల్లో స్నేహానికి గుర్తుగా వాడుతారు. పసుపు గులాబీలు ప్రేమలోని స్వచ్ఛతకు నిదర్శనంగా నిలుస్తాయని ప్రేమికుల నమ్ముతుంటారు.. అంతేకాదు ప్రేమ అనేది స్నేహంతో మొదలవుతుందని.. అలాంటి స్నేహాన్ని పది కాలాలపాటు కాపాడుకోవాలంటే కచ్చితంగా పసుపు రంగు గులాబీలు ఇవ్వాల్సిందేనని పాశ్చాత్యులు నమ్ముతుంటారు.

తెల్ల గులాబీలు

గులాబీల్లో ఎన్ని రంగులు ఉన్నప్పటికీ తెల్ల గులాబీలకు ప్రేమికులు ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. తెలుపు అంటేనే స్వచ్ఛతకు దర్శనం. తమ ప్రేమలో స్వచ్ఛతను, అమాయకత్వాన్ని, పారదర్శకతను వ్యక్తీకరించేందుకు ప్రేమికులు తెలుపు రంగు గులాబీలను ఇస్తుంటారు.. ముఖ్యంగా యువ ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తీకరించేందుకు తొలినాళ్లల్లో తెలుపు రంగు గులాబీలను వాడుతుంటారు.

గులాబీ రంగు గులాబీలు

గులాబీ పూలల్లో ఈ రంగు కున్న ప్రాధాన్యం వేరు. సాధారణంగా ఈ గులాబీలను ప్రేమను భిన్నంగా వ్యక్తికరించేందుకు ప్రేమికులు వాడుతుంటారు. తమ భాగస్వామి పట్ల శృంగార పరమైన ఆసక్తిని సూక్ష్మంగా వ్యక్తీకరించేందుకు ఈ రంగు పూలను ఇస్తుంటారు. గులాబీ రంగు పూలు భిన్నంగా ఉంటాయి కాబట్టి.. తమ ప్రేమలో భిన్నత్వాన్ని చూపించేందుకు ప్రేమికులు ఈ పూలను బహుమతిగా ఇస్తుంటారు.

ఆరెంజ్ గులాబీలు

ఇది పసుపు, ఎరుపు కలబోతతో ఉంటుంది. అందుకే ఈ పూలు చాలా భిన్నంగా ఉంటాయి. ప్రేమలో గాడతను, ఉద్వేగాన్ని ప్రదర్శించేందుకు ఈ పూలను ప్రేమికులు వాడుతుంటారు.. ప్రేమలో తమ తదుపరి స్థాయిని వ్యక్తీకరించేందుకు ఈ పూలను బహుమతిగా ఇస్తుంటారు. పాశ్చాత్య దేశాలలో తమ భాగస్వామి పట్ల ఉన్న కోరికను వ్యక్తం చేసేందుకు ఈ పూలను వాడుతుంటారు.