Team India : అసలు టీమిండియా క్రికెటర్లతో మోడీ ఏం మాట్లాడాడో తెలుసా? వైరల్ వీడియో

Team India స్పిన్నర్ యజువేంద్ర చాహల్ తో మోదీ సరదాగా మాట్లాడారు. వీలు చిక్కినప్పుడల్లా జోకులు వేస్తూ నవ్వించారు.. "మీ బౌలింగ్ బాగుంటుంది.. మైదానంలో మీ హాస్య స్పోరకమైన ప్రవర్తన నచ్చుతుంది..

Written By: NARESH, Updated On : July 5, 2024 10:23 pm

Do you know what Modi spoke to Team India cricketers

Follow us on

Team India : టి20 వరల్డ్ కప్ సాధించిన టీమిండియాతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సరదాగా ముచ్చటించారు. గురువారం జరిగిన భేటీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. జూన్ 29న బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికా జుట్టుతో జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా గణ విజయం సాధించింది. దాదాపు 17 సంవత్సరాల తర్వాత రెండవ టీ20 వరల్డ్ కప్ దక్కించుకుంది. వర్షం వల్ల ఆ బార్బడోస్ లో మూడు రోజులు పాటు ఉన్న టీమిండి ఆటగాళ్లు గురువారం తెల్లవారుజామున స్వదేశానికి వచ్చారు.. ఈ సందర్భంగా ఐటిసి మౌర్య హోటల్ కు వెళ్ళిన భారత ఆటగాళ్లు.. ఆ తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లారు. అక్కడ భారత ప్రధాని నరేంద్ర మోదీ – టీమిండియా ఆటగాళ్లు సరదాగా మాట్లాడుకున్నారు.. జట్టును గొప్పగా నడిపించిన తీరు పట్ల నరేంద్ర మోదీ రోహిత్ శర్మ కు అభినందనలు తెలిపారు. వరుస విజయాలు సాధించిన నేర్పు గొప్పగా ఉందని రోహిత్ శర్మను ఉద్దేశించి కితాబిచ్చారు.

ఇదే సమయంలో బార్బడోస్ మైదానంపై గడ్డి తిన్న రోహిత్ శర్మ పై ప్రధానమంత్రి ప్రశంసలు కురిపించారు..”ఫైనల్ విజయం తర్వాత మైదానంపై ఉన్న మట్టిని తిన్నారు.. గడ్డిని కూడా నోట్లో వేసుకున్నారు. మీకు ఎలా అనిపించిందని” రోహిత్ శర్మను ఉద్దేశించి ప్రధాని ప్రశ్నించారు..”ట్రోఫీని అందుకునే సమయంలో భిన్నంగా నడిచారు కదా.. ఆ వాకింగ్ స్టైల్ ప్రత్యేకంగా ఉంది. అసలు మీకు ఆ ఆలోచన ఎలా పుట్టింది? యజువేంద్ర చాహల్ మీకేమైనా ఐడియా ఇచ్చాడా?” అని ప్రధాని రోహిత్ శర్మను ప్రశ్నించారు.

ప్రధాని అడిగిన ప్రశ్నలకు రోహిత్ స్పష్టంగా సమాధానం చెప్పాడు. “సార్ నాకు.. టీమ్ ఇండియాతో 15 సంవత్సరాల అనుబంధం ఉంది. ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను. ఎన్నో గెలుపోటములు చూశాను. వన్డే వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో ఓటములు ఎదుర్కొన్నాను. ఆ సమయంలో మీరు మా దగ్గరికి వచ్చి మాట్లాడారు. గొప్పగా అనిపించింది. అదే ఆశావాహ దృక్పథంతో టీ – 20 వరల్డ్ కప్ ఆడాం.. ఐర్లాండ్ జట్టు నుంచి దక్షిణాఫ్రికా వరకు వరుసగా విజయాలు సాధించాం. కప్ గెలుచుకున్నాం. ఆ సన్నివేశం నాకు ఉద్వేగంగా అనిపించింది. అందుకే ఆ మైదానంపై మట్టి, గడ్డి తిన్నాను. అది నాకు ఒక జీవితకాల అనుభూతి, జ్ఞాపకం.. ఇక వాకింగ్ స్టైల్ ప్రత్యేకంగా ఉండాలని చాహల్, కులదీప్ చర్చించుకున్నారు.. ట్రోఫీని అందుకునేందుకు వచ్చేటప్పుడు సాధారణంగా నడుచుకుంటూ రావద్దని.. కాస్త డిఫరెంట్ గా చేయాలని చాహల్, కులదీప్ చెప్పారు. ఈసారి జట్టుపడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది కాబట్టి.. డిఫరెంట్ స్టైల్ తో కప్ అందుకునే అవకాశం నాకు లభించిందని” రోహిత్ శర్మ ప్రధానితో పేర్కొన్నారు..

ఈ సందర్భంగా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ తో మోదీ సరదాగా మాట్లాడారు. వీలు చిక్కినప్పుడల్లా జోకులు వేస్తూ నవ్వించారు.. “మీ బౌలింగ్ బాగుంటుంది.. మైదానంలో మీ హాస్య స్పోరకమైన ప్రవర్తన నచ్చుతుంది.. మీరు దానిని ఇలాగనే కొనసాగించండి” అంటూ చాహల్ ను ప్రధాని భుజం తట్టారు.