https://oktelugu.com/

Horoscope Today: శనీశ్వరుడి అనుగ్రహంతో ఈ రాశి వ్యాపారులకు అనుకోని ధన లాభం..

Horoscope Today వ్యాపార విషయంలో భాగస్వాముల మద్దతు ఉంటుంది. కొన్ని ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. జీవిత భాగస్వామి నమ్మకాన్ని గెలుచుకుంటారు.

Written By:
  • NARESH
  • , Updated On : July 6, 2024 / 08:24 AM IST

    Unexpected financial gain for this zodiac sign with the grace of Saturn

    Follow us on

    Horoscope Today: 2024 జూలై 6 శనివారం రోజున ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. నేడు త్రిపుర యోగం ఉండనుంది. అలాగే శనీశ్వరుడి అనుగ్రహం కొన్ని రాశులపై ఉండనుంది. దీంతో కొందరి జీవితాల్లో అనూహ్య మార్పులు రానున్నాయి. మరికొందరికి ప్రతికూల వాతావరణం ఉండనుంది.

    మేష రాశి:
    కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వివాహ విషయంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయి. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు.

    వృషభ రాశి:
    వ్యాపారులకు అనుకోని లాభాలు ఉంటాయి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో సీనియర్ల మద్దతు ఉంటుంది.

    మిథున రాశి:
    కుటుంబంలో కొన్ని చిక్కులు ఏర్పడుతాయి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు శుభవార్తలు వింటారు.

    కర్కాటక రాశి:
    ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండలి. కొన్ని వర్గాల నుంచి అధిక ఆదాయం వస్తుంది. శారీరక సమస్యలు ఎదుర్కొంటారు. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు.

    సింహారాశి:
    ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయాలి. కొన్ని విషయాల్లో తొందరపడొద్దు. షాపింగ్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో సమస్యలు ఏర్పడుతాయి.

    కన్య రాశి:
    ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారులు చేసేవారికి అధిక లాభాలు ఉంటాయి. విద్యార్థులు సంక్షోభం నుంచి బయటపడుతారు. సాయంత్రం ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.

    తుల రాశి:
    తీర్థయాత్రలకు వెళ్లేందుకు సిద్ధమవుతారు. ఆస్తికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. ఉద్యోగులు సీనియర్ల నుంచి పూర్తి మద్దతు పొందుతారు. ముఖ్యమైన పనులు పెండింగులో పడుతాయి.

    వృశ్చిక రాశి:
    కొత్త పనిని ప్రారంభించాలనుకునేవారికి ఇదే మంచి సమయం. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. ప్రియమైన వారితో సమయం కేటాయించాలి.

    ధనస్సు రాశి:
    పాత స్నేహితులను కలుసుకుంటారు. దీంతో మనసు ప్రశాంతంగా మారుతుంది. వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురవుతారు.

    మకర రాశి:
    ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగులు కార్యాలయాల్లో బాధ్యతలను పూర్తి చేస్తారు. వ్యాపారులు కొత్త ప్రణాళికలు వేస్తారు.

    కుంభరాశి:
    సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో ఉల్లాసంగా ఉంటారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది.

    మీనరాశి:
    వ్యాపార విషయంలో భాగస్వాముల మద్దతు ఉంటుంది. కొన్ని ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. జీవిత భాగస్వామి నమ్మకాన్ని గెలుచుకుంటారు.