Virat Kohli: 10వ తరగతిలో వీరట్ కోహ్లీ మార్కులు ఎంతో తెలుసా?

క్రికెట్ సామ్రాజ్యంలో తనకంటూ గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న కోహ్లీ కేవలం 12వ తరగతి మాత్రమే చదివారట. చదువులకు గుడ్ బాయ్ చెప్పి పూర్తి స్థాయిలో క్రికెటర్‌గా మారిపోయారు.

Written By: Swathi Chilukuri, Updated On : July 5, 2024 5:58 pm

Virat Kohli

Follow us on

Virat Kohli: మొనగాడు, టీమిండియా మాజీ సారథి, పరుగుల గుర్రం, కింగ్ అంటూ అభిమానుల ద్వారా ఎన్నో పేర్లు సంపాదించుకున్నారు విరాట్ కోహ్లీ. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్నప్పటి నుంచే క్రికెట్ మీద ఉన్న ఇష్టంతో ఆ దిశగా అడుగులు వేస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా వెనకడుగు వేయకుండా సక్సెస్ సాధించారు. ఈయన సక్సెస్ ఇండియా మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న క్రికెట్ అభిమానులు అందరూ కోహ్లీని గుర్తు పట్టేలా చేసింది. ఆ రేంజ్ లో కష్టపడ్డారు కోహ్లీ.

క్రికెట్ సామ్రాజ్యంలో తనకంటూ గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న కోహ్లీ కేవలం 12వ తరగతి మాత్రమే చదివారట. చదువులకు గుడ్ బాయ్ చెప్పి పూర్తి స్థాయిలో క్రికెటర్‌గా మారిపోయారు. ఏకంగా భారత్ తరఫున అండర్-19 వరల్డ్‌కప్‌లో ఆడి.. యువ భారత్ జట్టుని విజేతగా నిలిపారు కోహ్లీ. భారత్ జట్టులో ఉన్న ఈయన ఎన్నో రికార్డులను సృష్టించారు. అయితే రీసెంట్ గా ఈయన పదోతరగతి మార్క్ షీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని కూ అకౌంట్ లో కోహ్లీనే పోస్ట్ చేశారు.

ఈ మార్క్ షీట్ ను చూస్తే కోహ్లీకి లెక్కలంటే భయం అని అర్థం అవుతుంది. ఎందుకంటే లెక్కల్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. మిగిలిన ఇంగ్లిష్, హిందీ, సోషల్ సబ్జెక్టుల్లో ఫర్వాలేదన్నట్టుగా వచ్చాయి. మ్యాథ్స్, సైన్స్ లోనే కోహ్లికి తక్కువ మార్కులు వచ్చాయి. ఓ సారి ఆ మార్కులను కూడా చూసేయండి.

ఇంగ్లీష్‌లో 83, హిందీలో 75, గణితంలో 51, సైన్స్ & టెక్నాలజీలో 55, సోషల్ సైన్స్‌లో 81, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 74 మార్కులు సంపాదించారు. అయితే ఈ మార్కుల లిస్టును షేర్ చేసిన కోహ్లీ ‘మీ మార్కుల షీట్లలో ప్రాధాన్యమే ఇవ్వని విషయాలు మీ క్యారెక్టర్ బిల్డ్ చేయడంలో ఎంతగానో తోడ్పడుతుంది అంటూ ఫన్నీగా రాశారు. ఇందులో స్పోర్ట్స్ కాలమ్ ను ఖాళీ గా పెట్టారు. కానీ ఈ పోస్టును వెంటనే డిలీట్ చేసేసారు కోహ్లీ.