https://oktelugu.com/

SSMB29: మహేష్ బాబుని ఢీకొట్టనున్న విక్రమ్… రాజమౌళి భారీ స్కెచ్!

SSMB29: ఎస్ఎస్ఎంబీ 29 చిత్రానికి అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు పని చేయనున్నారు. హాలీవుడ్ నటులు సైతం భాగం కానున్నారట.

Written By:
  • S Reddy
  • , Updated On : July 5, 2024 / 03:58 PM IST

    Chiyaan Vikram to play the villain in Mahesh Babu-SS Rajamouli Movie

    Follow us on

    SSMB29: దేశంలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ గా తెరకెక్కనుంది ఎస్ఎస్ఎంబీ 29. మహేష్ బాబు-రాజమౌళి కాంబోలో వస్తున్న మొదటి చిత్రం ఇది. ఈ చిత్ర బడ్జెట్ దాదాపు రూ. 800 కోట్లు అని సమాచారం. ఆర్ ఆర్ ఆర్ మూవీతో రాజమౌళి ఫేమ్ గ్లోబల్ రేంజ్ కి చేరింది. ఈ క్రమంలో ఈసారి పాన్ వరల్డ్ మూవీ టార్గెట్ గా ఆయన అడుగులు వేస్తున్నారు. అందుకే యూనివర్సల్ సబ్జెక్టు ఎంచుకున్నాడు.

    కాగా ఎస్ఎస్ఎంబీ 29 చిత్రానికి అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు పని చేయనున్నారు. హాలీవుడ్ నటులు సైతం భాగం కానున్నారట. ఇండోనేషియాకు చెందిన చెస్లా అనే హీరోయిన్ ని ఫైనల్ చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమార్ ని రాజమౌళి ఓ పాత్ర కోసం సంప్రదించగా పచ్చ జెండా ఊపాడంటూ కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా మరో స్టార్ హీరో పేరు తెరపైకి వచ్చింది.

    కోలీవుడ్ స్టార్ విక్రమ్ ఎస్ఎస్ఎంబీ 29లో విలన్ రోల్ చేస్తున్నాడనే ప్రచారం జోరందుకుంది. రాజమౌళి ఈ చిత్రంలో విలన్ రోల్ చాలా పవర్ఫుల్ గా డిజైన్ చేశాడట. విక్రమ్ లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న నటుడైతే చక్కగా సరిపోతాడని, ఆ పాత్రకు న్యాయం చేకూరుతుందని, ఆయన భావిస్తున్నారట. విక్రమ్ ని రాజమౌళి సంప్రదించగా ఆయన ఓకే చెప్పారట. ఎస్ఎస్ఎంబీ 29లో హీరో మహేష్ ని ఢీకొట్టే విలన్ విక్రమ్ అని టాలీవుడ్ టాక్. కోలీవుడ్ మార్కెట్ ని కొల్లగొట్టేందుకు రాజమౌళి ఈ స్కెచ్ వేశాడని తెలుస్తుంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

    కాగా ఎస్ఎస్ఎంబి 29 ఈఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. స్క్రిప్ట్ లాక్ చేసిన రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశాడు. మహేష్ సైతం పాత్ర కోసం సిద్ధం అవుతున్నారు. ఆయన మేకోవర్ అవుతున్నారు. పెరిగిన గడ్డం, జుట్టులో మహేష్ బాబును మనం చూడొచ్చు. ఇది జంగిల్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా అని ఇప్పటికే చెప్పారు. హాలీవుడ్ హిట్ సిరీస్ ఇండియానా జోన్స్ ని తరహాలో ఉంటుందని రాజమౌళి వెల్లడించారు. ఈ చిత్రంపై ఇండియా వైడ్ అంచనాలు ఉన్నాయి.