https://oktelugu.com/

T20 World Cup Final: బూట్లలో పోసుకుని బీరు తాగడం.. ఆస్ట్రేలియన్ల సంప్రదాయం కథ తెలుసా?

T20 World Cup Final: వేపకాయంత వెర్రి వేయి రకాలుంటుందట. పుర్రెకో గుణం జిహ్వకో రుచి అంటూ ఉంటారు. ప్రపంచంలో ఎన్నో రకాల మనుషులు, జాతులు ఉన్నాయి. వీరి ఆచార వ్యవహారాలు కూడా భిన్నంగా ఉండటం తెలిసిందే. కొన్ని ఆచారాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అంత జుగుస్సాకరంగా ఉంటాయి. తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాళ్లను చూస్తే కూడా మనకు అదే అనిపిస్తుంది. వెర్రి అంటే వారిదే అనిపిస్తుంది. నాగరికత ఇంత అభివృద్ధి చెందినా ఇంకా పాతకాలం […]

Written By:
  • Srinivas
  • , Updated On : November 16, 2021 / 12:00 PM IST
    Follow us on

    T20 World Cup Final

    T20 World Cup Final: వేపకాయంత వెర్రి వేయి రకాలుంటుందట. పుర్రెకో గుణం జిహ్వకో రుచి అంటూ ఉంటారు. ప్రపంచంలో ఎన్నో రకాల మనుషులు, జాతులు ఉన్నాయి. వీరి ఆచార వ్యవహారాలు కూడా భిన్నంగా ఉండటం తెలిసిందే. కొన్ని ఆచారాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అంత జుగుస్సాకరంగా ఉంటాయి. తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాళ్లను చూస్తే కూడా మనకు అదే అనిపిస్తుంది. వెర్రి అంటే వారిదే అనిపిస్తుంది. నాగరికత ఇంత అభివృద్ధి చెందినా ఇంకా పాతకాలం వాటిని పట్టుకుని వేలాడటం నిజంగా వెర్రే.

    ఇటీవల జరిగిన టీ 20 ప్రపంచ కప్ ఫైనల్(T20 World Cup Final) లో ఆస్ట్రేలియా కివీస్ ను ఓడించి కప్ సాధించింది. వెంటనే సంబరాలు కూడా చేసుకుంది. కానీ వారి విధానం చూస్తేనే భయమేస్తుంది. కాలుకు వేసుకునే షూలో బీరు పోసుకుని తాగడం ఆశ్చర్యకరమే. ఆస్ట్రేలియాకు చెందిన పాత ఆచారాన్ని వారు పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా సంబరాలు చేసుకోవడాన్ని షూయి అంటారు.

    ఈ ఆచారం 18వ శతాబ్దంలో జర్మనీలో మొదలైందని తెలుస్తోంది. అదృష్టం కలిసి వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు కూడా ఇలా చేస్తారని చెబుతారు. ఇది ఆస్ట్రేలియాలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇటీవల కాలంలో మాత్రం దీనిపై పెద్దగా దృష్టి పెట్టకపోయినా ఇప్పుడు మళ్లీ ఇలా చేయడంపై అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    వెస్ర్టన్ సిడ్నీ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ మెడిసన్ గ్యాస్టో ఎంటరాలజీ దీనిపై పరిశోధనలు చేసి పలు విషయాలు వెల్లడించింది. బూట్లలో హానికర బ్యాక్టీరియా ఉంటుందని తేల్చింది. అల్కాహాల్ పోసి 60 క్షణాలు ఉంచి పరీక్షించింది. ఇందులో స్టాపలోకాకస్ అనే బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఇది కడుపులోకి వెళ్తే సెప్టిసిమియా, నిమోనియా, వాంతులు, ఆహారం విషపూరితం కావడం వంటి ప్రభావాలకు గురయ్యే ఆస్కారముందని తేల్చింది. దీంతో ఇది అంత సురక్షితం కాదని తెలిసినా ఆటగాళ్లు తమ వెర్రి కోసం ఇలా తాగడంపై విమర్శలు వస్తున్నాయి.

    Also Read: వరుసగా 10 మ్యాచ్ లు ఓడి.. ప్రపంచకప్ ను ఆస్ట్రేలియా ఎలా సాధించింది?

    న్యూజిలాండ్ vs ఆస్ట్రేలియా.. నువ్వా నేనా..? ఫైనల్ లో గెలుపెవరిది?

    Tags