kadalur dam demolished : ప్రజల కేంద్రంగా పాలన సాగితే వారి కష్టాలు మాత్రమే కనపడుతాయి. సంపద పోయినా సామర్థ్యం ఉంటే మళ్లీ కట్టుకోవచ్చు.. కానీ ప్రజలే పోతే.. అందుకే తమిళనాడు ప్రభుత్వం వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా బాంబులతో డ్యాంను పేల్చేసింది. ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్న స్టాలిన్ సర్కార్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.

తమిళనాడులోని విల్లుపురం జిల్లా కడలూరు జిల్లా సరిహద్దు గ్రామాల వద్ద దక్షిణ పెన్నానదిపై రూ.25 కోట్ల వ్యయంతో చెక్ డ్యామ్ ను నిర్మించారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచే ఈ డ్యాంను వినియోగంలోకి తీసుకొచ్చారు.
ఈ ఏడాది జనవరి 23వ తేదీన ఆనకట్ట క్రస్ట్ గేట్ల గోడ పాక్షికంగా దెబ్బతిన్నది. గోడ పగుళ్ల నుంచి నీరు బయటకు వస్తుండడంతో ఈ వ్యహారాలంలో బాధ్యులను చేస్తూ ఆరుగురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
రాష్ట్రంలో కొత్త ప్రబుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.15 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేయాలని నిర్ణయించింది. ఈలోగా తమిళనాడులో భారీ వర్షాలు కురిశాయి. దీంతో పెన్నానదికి వరద ఉధృతి పెరిగింది. ఎగువ దక్షిణ పెన్నానదిలో తాత్కాలికంగా ఇసుక బస్తాలు వేసి అడ్డుకట్ట వేయాలని చూసినా కుదరలేదు.
పెన్నానదిలో వరద ఉధృతి పెరగడంతో పైనున్న గ్రామాల్లోకి నీరు చేరింది. వరదతో గ్రామంలోని ఇళ్లు మునగడం ప్రారంభించాయి. గ్రామస్థులు వరదలో మునిగారు. దీంతో ఆదివారం క్రస్ట్ గేట్లను బాంబులతో కొంత మేర పేల్చివేశారు. సోమవారం బాంబులతో చెక్ డ్యామ్ ను పేల్చి వేసి గ్రామాలను వరద బారి నుంచి అధికారులు కాపాడారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి.