Homeఎంటర్టైన్మెంట్Hero Sumanth: మళ్లీ ట్రాక్​లోకి అక్కినేని హీరో.. మరో ప్రాజెక్టుకు శ్రీకారం!

Hero Sumanth: మళ్లీ ట్రాక్​లోకి అక్కినేని హీరో.. మరో ప్రాజెక్టుకు శ్రీకారం!

Hero Sumanth: సినిమాలతో ప్రేక్షకులను పలకరించి వారి మనసును దోచుకున్న అక్కనేని వారస్సుల్లో  ఒకరు సుమంత్​. విభన్న కథాంశాలతో అభిమానులను పలకరించే ఈ హీరోకు.. గత కొంత కాలంగా సరైన్ హిట్​ అందలేదు. గతంలో మళ్లీరావా సినిమాతో హిట్​కొట్టాడు. ఆ తర్వాత నుంచి ఎంతో జాగ్రత్తగా సినిమాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ మొదలైంది అనే సినిమాకు ఓకే చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్​ దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

sumanth

కాగా, తాజాగా, మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పి పట్టాలెక్కించారు ఈ యంగ్​ హీరో. సుమంత్​ నటిస్తోన్న కొత్త సినిమా అహం రీబూట్​. వాయుపుత్ర ఎంటర్​టైన్​మెంట్స్​, ఎస్​ ఒరిజినల్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రశాంత్​ సాగర్ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్​ అన్నపూర్ణ స్టూడియోస్​లో లాంఛనంగా ఈ సినిమా షూటింగ్​ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఓ పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం.

ఇందులో సుమంత్​ ఆర్జే పాత్రలో కనిపించనున్నారు. అహం రీబూట్ కచ్చితంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుందని దర్శకుడు ప్రశాంత్ సాగర్ అన్నారు అహం అంటే నేను అని అర్థం. ఇక రీబూట్​ అంటే మనిషికి సహజంగా ఉన్న కోపోద్రిక్తమైన లక్షణాలు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు. చాలా కాలం తర్వా త మళ్లీ ట్రాక్​లో పడిన సుమంత్​కు ఈ సినిమాతోనైనా మంచి కమర్షియల్​ బ్రేక్​ వస్తుందేమో వేచి చూడాలి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version