Anil Kumble Net Worth : క్రికెట్ సంచలనం.. అనిల్ కుంబ్లే ఎన్ని వేల కోట్ల ఆస్తులున్నాయో తెలుసా ?

1990లో కుంబ్లే వన్డే క్రికెట్‌లో టీమిండియాలోకి అడుగుపెట్టాడు. శ్రీలంకతో జరిగిన అరంగేట్రం మ్యాచ్‌లో అంతగా రాణించలేకపోయాడు.

Written By: Mahi, Updated On : October 17, 2024 2:05 pm

Anil Kumble Net Worth

Follow us on

Anil Kumble Net Worth : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, గ్రేట్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఈరోజు 53వ ఏట అడుగుపెట్టాడు. అతను క్రికెట్ నుండి రిటైర్ అయ్యి 15 సంవత్సరాలు గడిచినా, అతను ఇప్పటికీ అంతర్జాతీయ క్రికెట్‌లో తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉన్నారు. మొత్తం 956 వికెట్లతో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు నెలకొని ఉంది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్ అనిల్ కుంబ్లే. తాజాగా ఇంగ్లండ్‌ ఆటగాడు జేమ్స్‌ అండర్సన్‌ అతడిని వెనక్కి నెట్టి మూడో ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. అనిల్ కుంబ్లే 1970 అక్టోబర్ 17న కర్ణాటకలోని మైసూర్‌లో జన్మించారు. కేవలం 13 సంవత్సరాల వయస్సులో అతను క్రికెట్ క్లబ్‌లో చేరాడు. అక్కడ నుండి క్రికెట్ నేర్చుకున్నాడు. అతనికి క్రికెట్ పై మక్కువ ఉన్నా.. క్రికెట్‌పై ఉన్న మక్కువ తన చదువును ఏనాడు నెగ్లెక్ట్ చేయలేదు. తన క్రికెట్ ఆట చదువుపై ఏ విధంగానూ ప్రభావితం చేయనివ్వలేదు. బెంగళూరులో తన చదువును కొనసాగించాడు. 1989లో అతను కర్ణాటక తరపున ఫస్ట్ క్లాస్‌లో అరంగేట్రం చేసే అవకాశాన్ని పొందాడు. ఈ సమయంలోనే అతను తన మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేశాడు.

1990లో కుంబ్లే వన్డే క్రికెట్‌లో టీమిండియాలోకి అడుగుపెట్టాడు. శ్రీలంకతో జరిగిన అరంగేట్రం మ్యాచ్‌లో అంతగా రాణించలేకపోయాడు. అతను 10 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. దీని తరువాత, అదే సంవత్సరంలో అతను మాంచెస్టర్ టెస్ట్‌లో అరంగేట్రం చేసే అవకాశాన్ని పొందాడు. అక్కడ అతను మొదటి ఇన్నింగ్స్‌లో మాత్రమే 3 వికెట్లు తీయగలిగాడు. టెస్టుల్లో మొదట్లో పెద్దగా అవకాశాలు రాకపోయినా 2 ఏళ్ల తర్వాత 1992లో మళ్లీ అవకాశం వచ్చింది. దాని తర్వాత కుంబ్లే వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు..

అనిల్ కుంబ్లే కెరీర్‌లో మరపురాని క్షణం 1999లో పాకిస్థాన్‌తో జరిగిన ఢిల్లీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. క్రికెట్ చరిత్రలో జిమ్ లేకర్ తర్వాత టెస్టు మ్యాచ్‌లో ఇలాంటి ఫీట్ చేసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఎప్పటికీ మరచిపోలేని చరిత్రను కుంబ్లే ఆ మ్యాచ్ లో సృష్టించారు. 2002లో వెస్టిండీస్‌పై జరుగుతున్న మ్యాచ్ లో తీవ్ర గాయాల పాలైనా.. తలకు కట్టు కట్టుకుని ఆడి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఇక అనిల్ కుంబ్లే నికర విలువ 80 కోట్లు దాటింది. అతని ఆదాయ వనరు బీసీసీఐ నుండి జీతం, ఎండార్స్‌మెంట్‌లు, ఐపీఎల్ కాంట్రాక్ట్‌లు, వ్యక్తిగత వ్యాపారాలే. అతను బెంగళూరులో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశాడు. దేశవ్యాప్తంగా కుంబ్లేకు అనేక రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉన్నాయి. వన్యప్రాణుల ఫోటోగ్రఫీ అంటే అతడికి ఆసక్తి. అతను “జంబో ఫండ్” ను స్థాపించాడు, ఇది వన్యప్రాణుల సంరక్షణ కోసం పనిచేస్తున్న సంస్థలకు, వ్యక్తులకు “ది ఫౌండేషన్” వంటి స్వతంత్ర ఎన్జీవోలకు కూడా విరాళాలు అందజేస్తుంది.