BCCI: బీసీసీఐ ప్రభుత్వానికి చెల్లించే పన్ను.. ఎన్నికోట్లో తెలుసా?

ప్రపంచంలో అత్యంత క్రేజ్ ఉన్న క్రీడ క్రికెట్. దీనిని దృష్టిలో ఉంచుకొని పెద్ద పెద్ద కంపెనీలు వివిధ టోర్నీలు నిర్వహిస్తూ ఉంటుంది. మిగతా దేశాల్లో కంటే మనదేశంలో క్రికెటర్లకు రేట్లు ఎక్కువ.

Written By: Chai Muchhata, Updated On : August 9, 2023 8:33 am

BCCI

Follow us on

BCCI: భారతదేశంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి ఏదో ఒక రూపంలో పన్నును చెల్లిస్తారు. కానీ కొందరు ప్రత్యేక వ్యక్తులు, సంస్థలు నేరుగా ఆదాయపు పన్నును చెల్లిస్తాయి. వారికి వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సొమ్మును ఇచ్చేస్తుంది. వ్యక్తులు, సంస్థలు తమ ఆదాయంలో ప్రభుత్వం విధించిన నిర్ణీత మొత్తానికంటే ఎక్కువగా ఉంటే పర్సంటేజీని భట్టి చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు పన్ను నుంచి తప్పించుకునే మార్గాలను ఎంచుకుంటారు. కానీ సంస్థలు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ)ప్రభుత్వానికి చెల్లించే ఆదాయాన్ని చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. ఇంతకీ ప్రతీ ఏడాది బీసీసీఐ ప్రభుత్వానికి ఎంత ఆదాయం చెల్లిస్తుందో ఒకసారి పరిశీలిస్తే..

ప్రపంచంలో అత్యంత క్రేజ్ ఉన్న క్రీడ క్రికెట్. దీనిని దృష్టిలో ఉంచుకొని పెద్ద పెద్ద కంపెనీలు వివిధ టోర్నీలు నిర్వహిస్తూ ఉంటుంది. మిగతా దేశాల్లో కంటే మనదేశంలో క్రికెటర్లకు రేట్లు ఎక్కువ. అందుకు కారణంగా బీసీసీఐకి వస్తున్న ఆదాయమే. బీసీసీఐకి పలు రకాలుగా ఆదాయం వస్తుంది. కేవలం వన్డే, టీ20, టెస్ట్ క్రికెట్ కు సంబంధించిన హక్కులను విక్రయించడం ద్వారా కోట్లలో ఆదాయం ఆర్జిస్తుంది. ఇక ఐపీఎల్ సమయంలో ఈ సంస్థకు లెక్కలేనంతా రిటర్న్ వస్తుంది. టీవీ, డిజిటల్ రూపంలో కోట్ల రూపాయలు బీసీసీఐకి చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ఎంత ఎక్కువ ఆదాయం వస్తే అంత ఎక్కువ పన్నును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా నిర్వహిస్తున్న పార్లమెంట్ సమావేశాల్లో ఓ సభ్యుడు బీసీసీఐ చెల్లిస్తున్న ఆదాయపు పన్నుల వివరాలు తెలపాలని కోరాడు. దీంతో ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి ఇచ్చిన సమాధానంతో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. బీసీసీఐ ప్రభుత్వానికి చెల్లిస్తున్న ఆదాయాన్ని చూస్తే ప్రపంచంలోని అత్యంత ధనిక బోర్డుగా పేర్కొంటున్నారు. గడిచిన ఐదేళ్లకు సంబంధించిన వివరాలను ఆ సభ్యుడికి అందించింది. ఆ వివరాల్లోకి వెళితే..

మంత్రి ఇచ్చిన వివరాల ప్రకారం.. 2017-18 సంవత్సరంలో బీసీసీఐ ప్రభుత్వానికి రూ.596.63 కోట్లు చెల్లించింది. ఆ తరువాత 2018-19లో రూ.815.08 కోట్లు, 2019-20లో రూ.882.29 కోట్లు, 2020-21లో రూ.844.92 కోట్లు, 2021-22లో రూ.1,159కోట్ల పన్నును చెల్లించింది. ప్రతీ సంవత్సరం పన్ను పెరుగుతూ వస్తోంది. ఈ తరుణంలో బీసీసీఐకి ఎంత ఆదాయం వస్తుందోనని క్రీడాలోకం చర్చించుకుంటోంది. ఆ సంస్థకు వస్తున్న ఆదాయాన్ని భట్టే పన్నును చెల్లిస్తుందని తెలుస్తోంది.