Childhood Photo: తల్లి స్నానం చేయిస్తుంటే ఏడుస్తున్న ఈ పిల్లాడే ఇప్పుడు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్ హీరో!

మహేష్ బాబు 1979 ఆగస్టు 9న కృష్ణ-ఇందిర దంపతులకు జన్మించారు. తండ్రి కృష్ణ అప్పటికే సూపర్ హీరో కావడంతో మహేష్ బాబుకు సినిమాల గురించి తెలియకపోయినా ఆయనను సినిమాల్లో చూపించాలని కృష్ణ కోరుకునేవారు.

Written By: Chai Muchhata, Updated On : August 9, 2023 10:09 am

Childhood Photo

Follow us on

Childhood Photo: ఒక్క ఫొటో చరిత్రను తెలుపుతుంది.. ఒక్క ఫొటో జీవిత విశేషాలను చెబుతుంది..అందుకే చాలా మంది తమ గుర్తులను చిరకాలం ఉండేలా ఫొటోలు దిగుతుంటారు. ఈరోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉండడంతో ఎప్పటికప్పుడు ఫొటోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. కానీ పూర్వకాలంలో కొంతమంది వద్ద మాత్రమే కెమెరాలు ఉండేవి. వీరు అప్పట్లో అరుదైన కొన్ని చిత్రాలను తీసి భద్రపరిచారు. సందర్భాన్ని భట్టి బయటకు తీస్తున్నారు. లేటేస్టుగా ఓ పిల్లాడి ఫొటో సినీ సర్కిల్ లో ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలోని పిల్లాడు ఇప్పుడు పెద్ద స్టార్ హీరో.. తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని సొంత ఇమేజ్ తెచ్చుకున్నాడు. విశేషమేంటంటే ఈ ఫొటో తన ఫస్ట్ మూవీలోని స్టిల్. ఇంతకీ ఈ ఫొటో ఎవరిదో ఇప్పటికైనా గుర్తుపట్టారా? అయితే వివరాల్లోకి వెళ్లండి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు సీనియర్ హీరోలు ఇప్పటికీ హల్ చల్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణలతో పాటు వారి తరువాత తరం వారు సక్సెస్ సినిమాలతో దూసుకుపోతున్నారు. వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు సినీ జీవితం ప్రత్యేకమైనది. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోగా ఎదిగారు. ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. లేటస్టుగా ఆయన ‘గుంటూరు కారం’ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఆ తరువాత రాజమౌళి డైరెక్షన్లో ఓ సినిమా చేసే అవకాశం ఉంది.

మహేష్ బాబు 1979 ఆగస్టు 9న కృష్ణ-ఇందిర దంపతులకు జన్మించారు. తండ్రి కృష్ణ అప్పటికే సూపర్ హీరో కావడంతో మహేష్ బాబుకు సినిమాల గురించి తెలియకపోయినా ఆయనను సినిమాల్లో చూపించాలని కృష్ణ కోరుకునేవారు. ఈ క్రమంలో డైరెక్టర్ రాఘవేంద్ర రావు ‘నీడ’ చిత్రం కోసం చైల్డ్ ఆర్టిస్ట్ కోసం సెర్చ్ చేస్తున్నారు. ఈ తరుణంలో కృష్ణ గారి అబ్బాయి మహష్ ను చూసి వెంటనే ఓకే చెప్పారు. అలా మహేష్ 4 ఏళ్ల వయసులో ఉండగానే కెమెరా ముందు కనిపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వందల సినిమాలు తీసిన మహేష్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.

చైల్డ్ ఆర్టిస్టుగానే సంచలనాల సినిమాల్లో నటించిన మహేష్ హీరోగానూ ప్రభంజనం సృష్టించారు. 1999లో రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయన నేటి గుంటూరు కారం వరకు అన్నీ ప్రత్యేకమైనవే. చాలా సినిమాలు మహేష్ యాక్టింగ్ పైనే హిట్టుకొట్టాయనడంలో అతిశయోక్తి కాదు. 2006లో పూరిజగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ‘పోకిరి’ వసూళ్లలో 75 ఏళ్ల రికార్డును తిరగరాసిందంటే అందులో మహేష్ యాక్టింగే ప్రధాన కారణమని ఫ్యాన్స్ చెబుతూ ఉంటారు. ఇక రాజమౌళి తీయబోయే చిత్రంపై ఆయన అభిమానులు భారీ హోప్స్ పెట్టుకున్నారు.