https://oktelugu.com/

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కి తప్పిన పెను ప్రమాదం.. అభిమానులు వణికిపోయే వార్త చెప్పిన నిర్మాత!

ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ సినిమాకి దాదాపుగా ఫుల్ రన్ లో 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీనిని గబ్బర్ సింగ్ కేవలం మొదటి రోజే అధిగమించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు, చూడాలి మరి.

Written By: , Updated On : August 31, 2024 / 10:10 PM IST
Pawan Kalyan missed a big risk

Pawan Kalyan missed a big risk

Follow us on

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ని ఆయన అభిమానులు దేవుడిలాగా భావిస్తుంటారు. ఆయనకి సంబంధించిన ఏ చిన్న విషయాన్ని అయినా, అభిమానులు ఒక ఉత్సవం లాగా జరుపుకుంటారు. ఆయనని ఒక సినిమా హీరో గా కాకుండా, తమ ఇంట్లో మనిషిగా భావిస్తారు. అలాంటి వ్యక్తి మీద చిన్న గీత పడినా అభిమానులు తట్టుకోగలరా?, రెండు తెలుగు రాష్ట్రాలు తగలబడిపోతాయి కదా?, అలాంటి సందర్భం వచ్చే సంఘటన ఒకటి ‘గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ సమయంలో జరిగింది అంటూ నిర్మాత బండ్ల గణేష్ నేడు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడిన మాటలు అభిమానులకు వణుకు పుట్టించాయి. సెప్టెంబర్ 2 వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు.

దానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ టికెట్స్ గురించే చర్చలు జరుగుతున్నాయి. ఒక కొత్త సినిమాకి ఎలాంటి క్రేజ్ ఉంటుందో అలాంటి క్రేజ్ ఈ సినిమాకి ఏర్పడింది. ఈ సందర్భంగా మూవీ టీం ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయగా, బండ్ల గణేష్ తో పాటు డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘గబ్బర్ సింగ్ షూటింగ్ ని కొన్ని రోజులు గుజరాత్ లో చేసాము. అక్కడ పవన్ కళ్యాణ్ గారి పరిచయ సన్నివేశాన్ని తీస్తున్న సమయంలో ఘోర ప్రమాదం జరగబోయింది. గుర్రం నుండి ఆయన అదుపు తప్పి క్రిందపడబోయాడు. ఒకవేళ ఆయన క్రిందపడుంటే ఈరోజు మనకి దక్కేవారు కాదు. దేవుడి దయవల్ల ఆయనకి చిన్న గీత కూడా పడలేదు. కానీ ఆ సంఘటన గుర్తుకు వస్తుంటే ఇప్పటికీ భయం వేస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఇది ఇలా ఉండగా ‘గబ్బర్ సింగ్’ చిత్రం మొదటి రోజు కేవలం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లో మాత్రమే కాదు, ఆల్ ఇండియా వైడ్ గా ఆల్ టైం రికార్డు పెట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కనీవినీ ఎరుగని రేంజ్ లో ఉన్నాయని. కొత్తగా విడుదలైన సినిమాలను కూడా డామినేట్ చేస్తుందని, ఊపు చూస్తుంటే కేవలం తెలుగు రాష్ట్రాల నుండే ఈ సినిమా 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబడుతుందని అంటున్నారు. ప్రస్తుతం మన రీ రిలీజ్ చిత్రాలలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మురారి’ చిత్రం ఆల్ టైం రికార్డుగా నిల్చింది. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ సినిమాకి దాదాపుగా ఫుల్ రన్ లో 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీనిని గబ్బర్ సింగ్ కేవలం మొదటి రోజే అధిగమించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు, చూడాలి మరి.