Dinesh Karthik: ఐపీఎల్ లో భారీ సిక్సర్.. దినేష్ కార్తీక్ సరికొత్త రికార్డు

288 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు తెగించి ఆడింది. ముఖ్యంగా ఆ జట్టులో దినేష్ కార్తీక్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. అసాధారణ షాట్లతో హైదరాబాద్ బౌలింగ్ ను తునాతునకలు చేశాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 16, 2024 1:00 pm

Dinesh Karthik

Follow us on

Dinesh Karthik: ఐపీఎల్ లో భాగంగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో బెంగళూరు పై హైదరాబాద్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 287 రన్స్ చేసింది . హైదరాబాద్ ఆటగాళ్లు హెడ్ 102, క్లాసెన్ 67, సమద్ 37, మార్క్రం 32, అభిషేక్ శర్మ 34 పరుగులు చేసి బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించారు.

288 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు తెగించి ఆడింది. ముఖ్యంగా ఆ జట్టులో దినేష్ కార్తీక్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. అసాధారణ షాట్లతో హైదరాబాద్ బౌలింగ్ ను తునాతునకలు చేశాడు. దీంతో హైదరాబాద్ బౌలర్లు ఒక్కసారిగా ఆత్మ రక్షణలో పడ్డారు.. దినేష్ కార్తీక్ బ్యాట్ తో మైదానంలో తాండవం చేస్తుంటే.. అతడికి లొమ్రార్(19), అరుణ్ రావత్ (25*) సహకరించారు.. కార్తీక్ దూకుడుకు బెంగళూరు 12.4 లోనే 150, 16.1 ఓవర్లలోనే 200 మార్క్ పరుగులకు చేరుకొని హైదరాబాద్ జట్టు కు గట్టి పోటీ ఇచ్చింది.

ఈ మ్యాచ్లో బెంగళూరు తరఫున దినేష్ కార్తీక్ ఆడిన ఇన్నింగ్స్ హైలెట్ గా నిలిచింది. 38 సంవత్సరాల వయసు ఉన్న దినేష్ కార్తీక్ నటరాజన్ బౌలింగ్లో భారీ సిక్సర్ కొట్టాడు. ఏకంగా అది 108 మీటర్ల ఎత్తులో ఎగురుకుంటూ స్టాండ్స్ లో పడింది.. ఇదే మ్యాచ్లో హైదరాబాద్ బ్యాటర్ క్లాసెన్ పెర్గ్యూ సన్ బౌలింగ్లో కొట్టిన సిక్సర్ 106 మీటర్ల ఎత్తులో ఎగిరి స్టాండ్స్ లో పడింది. అయితే క్లాసెన్ రికార్డును కేవలం నిమిషాల వ్యవధిలోనే దినేష్ కార్తీక్ అధిగమించాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు దినేష్ కార్తీక్ కొట్టిన సిక్సరే హైయెస్ట్ గా నిలిచింది. ఆ తర్వాత హైదరాబాద్ ఆటగాడు క్లాసెన్ కొట్టిన సిక్స్ 106 మీటర్లు రెండవ స్థానంలో ఉంది. వీరిద్దరి కంటే ముందు బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో కోల్ కతా ఆటగాడు వెంకటేష్ అయ్యర్ కొట్టిన సిక్స్ కు బంతి 106 మీటర్ల ఎత్తుకు ఎగిరింది.. బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో లక్నో ఆటగాడు నికోలస్ పూరన్ కొట్టిన సిక్స్ కు బంతి 106 మీటర్ల ఎత్తుకు ఎగిరింది. ఇక ముంబై ఆటగాడు ఇషాన్ కిషన్ కొట్టిన సిక్స్ కు బంతి 103 మీటర్ల ఎత్తుకు ఎగిరింది.