Pushpa 2: పాన్ ఇండియాలో అద్భుతాన్ని సృష్టించిన పుష్ప సినిమాకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 సినిమా మీద రోజు రోజుకి అంచనాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇక ఎప్పుడైతే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారో అప్పటినుంచి సినిమా మీద హైప్ అయితే మామూలుగా లేదు. ఇక రీసెంట్ గా గదర్ 2 సినిమా దర్శకుడు ‘అనిల్ శర్మ’ పుష్ప 2 సినిమా టీజర్ ను చూసి ఆ సినిమా మీద పలు రకాల ఆసక్తికరమైన కామెంట్లైతే చేశాడు.
ఇక ఆ టిజర్ ను చూసిన వెంటనే ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ ‘గత సంవత్సరం ఆగస్టు15 వ తేదీన గదర్ 2 సినిమా వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక ఇప్పుడు అదే రోజు వస్తున్న పుష్ప 2 సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను’ అని తను ఎక్స్ వేదికగా రాసుకోచ్చాడు. ఇక దానికి మన ‘ఐకాన్ స్టార్’ రీప్లే ఇస్తూ ఆయన తెలిపిన విషెస్ కి కృతజ్ఞతలు చెబుతూ ఈ సినిమా కూడా గదర్ 2 లాగా సూపర్ సక్సెస్ అవుతుందని తన కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేశాడు…
ఇక ఇదిలా ఉంటే గదర్ సినిమా మొదటి పార్ట్ వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక గదర్ సినిమా వచ్చిన చాలా సంవత్సరాల తర్వాత ఆ సినిమా కి సీక్వెల్ గా గదర్ 2 వచ్చి రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ సంపాదించడం అనేది మామూలు విషయం కాదు. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా కూడా గదర్ 2 మూవీ లాగానే సీక్వెల్ సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయని పలువురు ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ రెండు సినిమాలు కూడా సిక్వెల్స్ కావడం విశేషం. ఇంకా ఇప్పుడు పుష్ప 2 సినిమా కూడా అదే సీన్ ను రిపీట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆగస్టు 15వ తేదీ కోసం ప్రతి ప్రేక్షకుడు చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…