Homeక్రీడలుక్రికెట్‌Gambhir And Rohit Sharma: ఛాంపియన్స్‌ ట్రోఫీ జట్టు కూర్పుపై గంభీర్, రోహిత్ శర్మ మధ్య...

Gambhir And Rohit Sharma: ఛాంపియన్స్‌ ట్రోఫీ జట్టు కూర్పుపై గంభీర్, రోహిత్ శర్మ మధ్య విభేదాలు.. వైస్‌ కెప్టెన్‌ విషయంలోనూ డిబేట్‌!*

Gambhir And Rohit Sharma: ఛాంపియన్స్‌ ట్రోఫీ టోర్నీలో పాల్గొనే టీమిండియా జట్టును సెలక్టర్లుల శనివారం(జనవరి 18న) ప్రకటించారు. వాస్తవానికి జవని 12 లోపే ప్రకటించాల్సి ఉండగా, బీసీసీఐ ప్రత్యేక అనుమతితో వారం గడువు తీసుకుంది. ఈ మేరకు శనివారం తుది జట్టును ప్రకటించింది. అయితే జట్టులో పెద్దగా మార్పు లేదు. పాత చింతకాయపచ్చడి తరహాలోనే వెటరన్స్‌(Wetarans)కు స్థానం కల్పించారు. ఫామ్‌లో లేని ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వడంపై క్రికెట్‌ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే జట్టు కూర్పుపై హెడ్‌ కోచ్‌ గంభీర్, కెప్టెన్‌ రోహిత్‌శర్మ మధ్య తీవ్ర చర్చ జరిగినట్లు తెలుస్తోంది. హార్ధిక్‌(Hardik)ను వైస్‌ కెప్టెన్‌ చేయడం, సెకండ్‌ వికెట్‌ కీపర్‌గా సంజూ శాంసన్‌(Sanzu samsan)ను తీసుకోవాలని గంభీర్‌ సూచించారట. అయితే వైస్‌ కెప్టెన్‌గా గిల్, కీపర్‌గా పంత్‌ ఉండాలని కెప్టెన్‌ రోహిత్, కోచ్‌ అగార్కర్‌ పట్టుబట్టినట్లు తెలిసింది. ఈ విషయమై ఇద్దరి మధ్య డిబేట జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కెప్టెన్‌పై కోచ్‌ అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ఛాంపియన్స్‌ ట్రోఫీ జట్టు కూర్పు సందర్భంగా మరోమారు ఇద్దరి మధ్య తీవ్ర చర్చ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

స్పందించిన రోహిత్‌..
ఈ వార్తల నేపథ్యంలో కెప్టెన్‌ రోహిత్‌ స్పందించారు. స్క్వాడ్‌లో కొందరికి అవకాశం రాకపోవడానికి కారణాలు వెల్లడించారు. దేశవాళీ క్రికెట్‌లో నాణ్యమైన క్రికెట్‌ ఆడినప్పటికీ కరుణ్‌ నాయర్‌కు అవకాశం ఇవ్వలేకపోయామని, శుభ్‌మన్‌ గిల్‌(Shubman Gill) వైస్‌ కెప్టెన్సీ సమర్థవంతంగా నిర్వహిస్తారని నమ్మామని వెల్లడించారు. ఇక కోచ్‌కు తనరకు మరస్పర్థలు ఉన్నట్లు వచ్చిన వార్తలను, సోషల్‌ మీడియాలో సాగుతున్న ప్రచారాన్ని ఖండించారు. గంభీర్‌తో తన బంధంపై వివరణ ఇచ్చాడు. సీనియర్‌ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌ ఆడే అంశంపైనా స్పందించారు.

సమయం లేకనే..
జాతీయ క్రికెటర్లు దేశవాళీ క్రికెట్‌ ఆడేంత సమయం దొరకడం లేదని కెప్టెన్‌ పేర్కొన్నారు. ఏడాది పొడవునా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు కచ్చితంగా బ్రేక్‌ కావాలని తెలిపారు. అలాంటప్పుడు డొమెస్టిక్‌ క్రికెట్‌(Domestic Cricket) ఆడడం చాలా కష్టమన్నారు. దేశవాళీ మ్యాచ్‌లు ఆడకుండా కావాలని ఎవరూ తప్పించుకోవడం లేదని వెల్లడించారు. ఈసారి తాను ముంబైకి ఆడుతున్నట్లు తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు ఆడేందుకు రెడీ అవుతున్నానన్నాడు.

సిరాజ్‌ను అందుకే ఎంపిక చేయలేదు..
ఇక ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం ప్రకటించిన జట్టులో సిరాజ్‌ను తప్పించడానికి కారణం వెల్లడించారు. బుమ్రా ఫిట్‌నెస్‌పై సందేహాలు ఉన్నాయని తెలిపారు. కొత్త బంతితో సిరాజ్‌ రాణించలేడన్నారు. హర్షదీప్‌ సింగ్‌కు అందుకే అవకాశం ఇచ్చామన్నాడు. హర్షదీప్‌ రెండువైపులా బౌలింగ్‌ చేస్తాడని వెల్లడించారు. ఈసారి ముగ్గురు పేసర్లను తీసుకున్నామన్నాడు. ఆల్‌రౌండర్లు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.

విభేదాలు లేవు..
ఇక కోచ్‌ గంభీర్‌తో పొసగడం లేదని అంతా అనుకుంటున్నారని, మైదానంలో దిగాక కెప్టెన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానిని గౌరవించే కోచ్‌ గంభీర్‌ అన్నారు. మా మధ్య అలాంటి నమ్మకం ఉందని తెలిపారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version