Duleep trophy 2024 : దులీప్ ట్రోఫీలో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం లో ఇండియా – ఏ, బీ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మ్యాచ్ చివరి వరకు ఆసక్తికరంగా సాగింది. అయితే ఇండియా – బీ జట్టును విజయం వరించింది. చివరి రోజు ఇండియా – బీ జట్టు 184 రన్స్ కు ఆల్ అవుట్ అయింది. ఓవర్ నైట్ స్కోర్ 150 పరుగులకు మరో 34 పరుగులు జోడించి.. చివరి 4 వికెట్లు కోల్పోయింది. ఆకాష్ దీప్ నాలుగు టికెట్లు తీశాడు. ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇండియా – బీ జట్టులో రిషబ్ పంత్ 51, సర్ఫరాజ్ ఖాన్ 46 పరుగులు చేసి టాప్ స్కోరర్లు గా నిలిచారు. అయితే ఈ ఇన్నింగ్స్ లో ఇండియా యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ మ్యాచ్ లో అతడు ఏకంగా ఏడు క్యాచ్ లు అందుకున్నాడు.. ఇదే సమయంలో అత్యంత అరుదైన ఘనతను తన సొంతం చేసుకున్నాడు. దులీప్ ట్రోఫీ చరిత్రలో అత్యధికంగా క్యాచ్ లు అందుకున్న వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని సరసన ధ్రువ్ జురెల్ చేరాడు. 2004 -05 సీజన్లో ఈస్ట్ జోన్ తరఫున మహేంద్ర సింగ్ ధోని ఆడాడు. ఆ సమయంలో అతడు ఏకంగా ఏడు క్యాచ్ లు అందుకున్నాడు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఈ ఘనతను ఇండియా – ఏ జట్టు తరఫున ధ్రువ్ జురెల్ ఈ కాల్ చేశాడు. ధోని, ధ్రువ్ జురెల్ తర్వాత బెంజిమెన్, విశ్వనాథ్ ఉన్నారు. బెంజమిన్ 1973-74 రంజి సీజన్లో ఒక మ్యాచ్లో అతడు ఆరు క్యాచ్ లు అందుకున్నాడు. 1980 రంజి సీజన్ కాలంలో విశ్వనాధ్ ఓ మ్యాచ్ లో ఆరు క్యాచ్ లు అందుకున్నాడు.
75 పరుగులకే ఐదు వికెట్లు..
చివరి రోజు ఆటలో ఇండియా – ఏ జట్టు 75 పరుగులకే 5 వికెట్లు నష్టపోయింది. ఇండియా – ఏ జట్టులో మయాంక్ అగర్వాల్ 4, రియాన్ పరాగ్ 31, గిల్ 21 , ధ్రువ్ జురెల్(0), తనుష్ కోటియన్(0) పూర్తిగా నిరాశపరిచారు.. కేఎల్ రాహుల్, శివమ్ దూబే కాసేపు ప్రతిఘటించారు. దీంతో ఓటమి అంతరం తగ్గింది గాని.. ఇండియా – ఏ జట్టుకు పరాజయం తప్పులేదు. మొదటి ఇన్నింగ్స్ లో ఇండియా – బీ జట్టు 321 రన్స్ చేసింది. ముషీర్ ఖాన్ 181 రన్స్ చేశాడు. నవదీప్ షైనీ 56 పరుగులు చేశాడు. ఆకాష్ దీపు నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇండియా – ఏ జట్టు తొలి ఇనిస్లో 231 రన్స్ చేసింది. రాహుల్ చేసిన 37 పరుగులే ఆ జట్టు ఇన్నింగ్స్ లో హైయెస్ట్ స్కోర్. ముఖేష్ కుమార్, నవదీప్ షైనీ మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. సాయి కిషోర్ 2 వికెట్లు దక్కించుకున్నాడు.
&
Fantastic ️
Akash Deep has bowled brilliantly and picked up 9 wickets in the match
Re-live his five-wicket haul in the 2nd innings ️ #DuleepTrophy | @IDFCFIRSTBank
Follow the match ▶️ https://t.co/eQyu38Erb1 pic.twitter.com/Cc95TyaqdU
— BCCI Domestic (@BCCIdomestic) September 8, 2024
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More