US open 2024 : గత ఏడాది సబలెంక యూఎస్ ఓపెన్ టైటిల్ దూరం చేసుకుంది. అప్పట్లో కోకో చేతిలో ఓటమిపాలైంది. ఈసారి విజేతగా ఆవిర్భవించింది. మన కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. అమెరికా క్రీడాకారిణి జెస్సికా పెగులా పై 7-5, 7-5 వరస సైట్లలో సబ లెంక గ్రాండ్ విక్టరీ సాధించింది. సబ లెంక 2023, 2024 సీజన్ లలో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిళ్లు సొంతం చేసుకుంది. అమెరికన్ ఓపెన్ గెలిచిన తర్వాత సబ లెంక ఒక్కసారిగా కన్నీటి పర్యంతమైంది. ” ఓ దేవుడా.. ఎంత గొప్ప విజయాన్ని నాకు అందించావు.. నాకు ఈ సమయంలో మాటలు రావడం లేదు. చాలాసార్లు టైటిల్ కు చేరువగా వచ్చాను. టైటిల్ గెలవడం నా కల. ఈ అపురూపమైన టైటిల్ సొంతం చేసుకున్నాను. చివరి పోటీలో ఓడిపోతే ఆవేదన తీవ్రంగా ఉంటుంది. అది ఎంత స్థాయిలో ఇబ్బంది పెడుతుందో నాకు తెలుసు. నా ప్రత్యర్థి జెస్సికా అద్భుతంగా ఆడింది. భవిష్యత్తు కాలంలో ఆమె కచ్చితంగా టైటిల్ సొంతం చేసుకుంటుంది. పట్టుదలతో శ్రమిస్తే విజయం లభిస్తుంది. మన కలను నిజం చేసుకునే మార్గం లభిస్తుందని” ఆమె పేర్కొంది..
ఎంత ప్రైజ్ మనీ లభించిందంటే..
ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ గెలిచిన తర్వాత సబ లెంక ట్రోఫీని సగర్వంగా ప్రదర్శించింది. ట్రోఫీతో పాటు ఆమెకు 3.6 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ లభించింది. జెస్సికాకు 1.8 మిలియన్ డాలర్ల నగదు శబ్దం చేసుకుంది. జెస్సికా తన కెరియర్లో తొలిసారి క్వార్టర్స్ పోటీలో గెలిచింది. ఆ తర్వాత అనితర సాధ్యమైన ఆట తీరు ప్రదర్శించి ఫైనల్ దాకా వచ్చింది. ఫైనల్లో మెరుగైన ప్రదర్శన కొనసాగించింది. అయితే సబ లెంక దూకుడు కొనసాగించడంతో జెస్సికాకు ఓటమి తప్పలేదు.. వాస్తవానికి అమెరికన్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో జెస్సికా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ వారందరి అంచనాలను సబ లెంక తలకిందులు చేసింది.. తన మార్క్ ఆటతీరుతో టైటిల్ గెలిచింది. యూఎస్ ఓపెన్ లో సరికొత్త విజేతగా ఆవిర్భవించింది.
సోషల్ మీడియాలో మార్మోగుతున్న పేరు
సబ లెంక యూఎస్ ఓపెన్ గెలిచిన తర్వాత.. సోషల్ మీడియాలో ఆమె పేరు మార్మోగిపోతోంది.. ట్విట్టర్, గూగుల్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ట్రెండ్స్ లో ఆమె మోస్ట్ సెర్చింగ్ పర్సనాలిటీగా మారిపోయింది.. ఆమె విజయం సాధించిన తర్వాత బెలారస్ దేశానికి చెందిన నెటిజన్లు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ” మా దేశ యువతి యూఎస్ ఓపెన్ గెలిచింది. ఇది మాకు ఎంతో గర్వకారణం. ఆమె సాధించిన విజయంతో మా దేశం పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇలాంటి విజయాలను ఆమె మరిన్ని సాధించాలని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More