https://oktelugu.com/

Dhoni wife Sakshi: ధోని భార్య సాక్షి పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది…ఇంతకీ ఆమె ఏం పెట్టిందంటే..?

హైదరాబాద్ లోని స్టార్ ప్లేయర్లందరూ పెవిలియన్ బాట పట్టడంతో చెన్నై ఈజీగా ఈ మ్యాచ్ ను తన ఖాతాలో వేసుకోగలిగింది. ఇక ఈ మ్యాచ్ తో చెన్నై ఐదు మ్యాచ్ ల్లో గెలిచి నెంబర్ త్రీ పొజిషన్ లో కొనసాగుతుంది.

Written By:
  • Gopi
  • , Updated On : April 29, 2024 / 02:50 PM IST

    Dhoni wife Sakshi social media post is too cute to miss

    Follow us on

    Dhoni wife Sakshi: చెన్నై చెపక్ వేదికగా హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లా మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై టీమ్ 78 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై టీం 212 పరుగులు చేయగా, హైదరాబాద్ టీమ్ మాత్రం 38 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఇక చెన్నై బౌలర్ అయిన తుషార్ దేశ్ పాండే 4 వికెట్లు తీసి హైదరాబాద్ టీమ్ ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు.

    ఇక ఆయన దాటికి హైదరాబాద్ లోని స్టార్ ప్లేయర్లందరూ పెవిలియన్ బాట పట్టడంతో చెన్నై ఈజీగా ఈ మ్యాచ్ ను తన ఖాతాలో వేసుకోగలిగింది. ఇక ఈ మ్యాచ్ తో చెన్నై ఐదు మ్యాచ్ ల్లో గెలిచి నెంబర్ త్రీ పొజిషన్ లో కొనసాగుతుంది. ఇక ఇలాంటి సందర్భంలో మహేంద్ర సింగ్ ధోని భార్య అయిన సాక్షి తన ఇన్ స్టా లో పెట్టిన స్టోరీ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక సాక్షి సోషల్ మీడియా లో ఎప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటుంది.

    ఇక అందులో భాగంగానే తనకు సంబంధించిన విషయాలన్నింటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ఇప్పుడు కూడా ఈ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ” ప్లీజ్ ఈరోజు మ్యాచ్ తొందరగా ముగించండి. బేబీ ఈజ్ ఆన్ ది వే కాబోయే అత్తగా నా రిక్వెస్ట్ ” అంటూ సాక్షి ఇన్ స్టా లో ఒక స్టోరీని అయితే పెట్టింది. ఇక దీంతో సాక్షి అత్తవుతుంటే, ధోని మామ అవుతున్నాడు అంటూ చాలా మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా విపరీతమైన కామెంట్లు చేస్తున్నారు.

    ఇక ఇదిలా ఉంటే సాక్షి మాటలకు గౌరవం ఇచ్చిన ధోని చాలా తొందరగా ఈ మ్యాచ్ ను ముగించే ప్రయత్నం కూడా చేశాడు అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…