Shivam Dubey : శివం దుబే ఐపీఎల్ లో సత్తా చాటినప్పటికీ.. టీమిండియాలో అతడు తన పూర్తిస్థాయి ప్రతిభను నిరూపించుకోలేకపోయాడు. టి20 వరల్డ్ కప్ లో అవకాశం లభించినప్పటికీ.. తన స్థాయికి తగ్గట్టుగా ఇన్నింగ్స్ ఆడ లేకపోయాడు. మిగతా ఆటగాళ్లు మెరుగైన బ్యాటింగ్ చేశారు కాబట్టి శివం దుబే ఆడకున్నా చెల్లుబాటయింది. ఒకవేళ టీం ఇండియా ఆటగాళ్లు గనుక విఫలమైతే.. శివం దుబే మీద ఒత్తిడి పడేది. ఒత్తిడిలో శివం తేలిపోతాడు. అప్పుడు అతడి మీద విమర్శలు పెరిగేవి. అదృష్టవశాత్తు ఇలాంటివేవీ జరగలేదు కాబట్టి శివం దుబే విమర్శల పాలు కాలేదు.. టి20 వరల్డ్ కప్ తర్వాత శివం దుబే కు టీమిండియాలో అవకాశం లభించింది. గాయం వల్ల అతడు జట్టులో ఆడలేక పోతున్నాడు. ఆ గాయం నుంచి కోలుకోవడానికి అతడు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టుతో భారత మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ లో ఆడేందుకు అవకాశం వచ్చింది. అయితే గాయం కారణంగా అతడు వైదొలిగాడు.
తెలివిగా సమాధానం చెప్పాడు
శివం దుబే కు పెద్దగా మ్యాచ్ లేవీ లేకపోవడంతో పలు షోలకు హాజరవుతున్నాడు. ఇటీవల అతడు కపిల్ శర్మ నిర్వహించిన కామెడీ షో లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడికి ఒక చిక్కు ప్రశ్న ఎదురు కాగా.. అతడు అత్యంత తెలివిగా సమాధానం చెప్పాడు. అది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ” ప్రస్తుతం టీమిండియా కు టెస్టులు, వన్డేలలో రోహిత్ నాయకత్వం వహిస్తున్నాడు. నువ్వు ధోని నాయకత్వంలో కూడా ఆడావు. వీరిద్దరిలో ఉత్తమమైన కెప్టెన్ ఎవరంటే ఏం సమాధానం చెబుతావని” కపిల్ అడిగాడు.. దానికి దుబే అత్యంత తెలివిగా సమాధానం చెప్పాడు..” నేను చెన్నై జట్టు తరఫున ఆడుతున్నప్పుడు ధోని నా ఉత్తమ కెప్టెన్. అదే నేను భారత జట్టుకు ఆడుతున్నప్పుడు నా ఉత్తమ నాయకుడు రోహిత్ అని” శివం దుబే వ్యాఖ్యానించాడు. అతడి సమాధానం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నది. అయితే చెన్నై జట్టు తరఫున శివం దుబే ఆడుతున్నాడు. ధోని నాయకత్వంలో అతడు అనేక మ్యాచులు ఆడాడు. ఆ అనుభవం వల్లే టి20 వరల్డ్ కప్ లో స్థానం సంపాదించుకున్నాడు. కాగా, గాయం కారణంగా శివం దుబే బంగ్లాదేశ్ తో జరిగే టి20 సిరీస్ కు దూరంగా ఉన్నాడు. అతడి స్థానంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు బీసీసీఐ అవకాశం ఇచ్చింది.
KAPIL : Shivam, Which Captain you like the most ? Rohit or MS Dhoni ?
ROHIT : fass gaya ye ab pic.twitter.com/fnUZm5pvUB
— (@Oyye_Senpai) October 5, 2024