Dhoni Vs Kohli: సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. అయితే బెంగళూరులో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. శనివారం మ్యాచ్ సజావుగా సాగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే శనివారం అక్కడ వర్షం కురిసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పైగా శనివారం ఉదయం నుంచి బెంగళూరులో ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి.. అక్కడ ఏ క్షణమైనా వర్షం కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు.. గత రెండు రోజులుగా బెంగళూరులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక శనివారం కూడా వర్షం కురిసేందుకు అవకాశం ఉంది.
Also Read: కాబోయే భర్తను పరిచయం చేసిన జాను లిరి, ఒక్కరోజు వ్యవధిలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్
ఇదే చివరి సారా?
బెంగళూరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోటీ అంటే రసవత్తరంగా ఉంటుంది. లీగ్ లేదా నాకౌట్ దశలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే విపరీతమైన హైప్ ఉంటుంది. ఎందుకంటే బెంగళూరు తరఫున విరాట్ కోహ్లీ ఆడుతుండడం.. చెన్నై జట్టుకు ధోని నాయకత్వం వహిస్తుండడమే ఇందుకు కారణం. ఒకవేళ ఈరోజు జరిగే మ్యాచ్లో బెంగళూరు విజయం సాధిస్తే దర్జాగా ప్లే ఆఫ్ వెళ్తుంది. ఇప్పటివరకు పది మ్యాచ్లు ఆడి ఏడు ఓటములతో పాయింట్లు పట్టికలో చెన్నై చివరి స్థానంలో ఉంది. ఎలాగైనా బెంగళూరు తో జరిగే మ్యాచ్లో గెలిచి గౌరవప్రదంగా ఈ సీజన్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నది. ఈరోజు జరిగే మ్యాచ్ విరాట్ కోహ్లీకి, ధోనికి ప్రత్యర్థులుగా చివరిదని ఇక సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే 43 ఏళ్ల వయసుకు వచ్చిన ధోనికి ఇదే తన చివరి ఐపీఎల్ అని తెలుస్తోంది. వచ్చే సీజన్లో ధోని ఆడకపోవచ్చు అని కొంతమంది అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు 2026 లో ధోని గట్టిగా ఇస్తానని అతని అభిమానులు పేర్కొంటున్నారు.. ఎట్టి పరిస్థితుల్లోనూ చెన్నై జట్టు ధోనిని వదులుకోదని.. అతనితో ఆడిస్తూనే ఉంటుందని వివరిస్తున్నారు. ” ధోని నాయకత్వం బాగానే ఉంది. కాకపోతే ఆటగాళ్ల మధ్య సమన్వయం లేకుండా పోతోంది. కొంతమంది ఆటగాళ్లు సరిగ్గా ఆడటం లేదు. ఇదే విషయాన్ని ధోని ఇటీవల వెల్లడించాడు. సాధారణంగా ఒక ఆటగాడి గురించి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడానికి ఇష్టపడని ధోని తొలిసారిగా ఇలాంటి మాటలు మాట్లాడాడు అంటే చెన్నై జట్టులో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సీజన్ ఎలాగూ ముగిసిపోయింది. వచ్చేసారికైనా చెన్నై జట్టు మేనేజ్మెంట్ పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి.. ఐపీఎల్ లోకి ప్రవేశించాలని” ధోని అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. అలా చేయని పక్షంలో చెన్నై జట్టు మరింత ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.