Janulyri: సోషల్ మీడియా సెలెబ్స్ లో జానూ లిరి ఒకరు. ఈమె అసలు పేరు ఝాన్సీ. ఫోక్ సాంగ్స్ కి డాన్స్ చేస్తూ పాపులారిటీ రాబట్టింది. ఢీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 విన్నర్ గా నిలిచి మరింత ఫేమ్ సొంతం చేసుకుంది. ఇంస్టాగ్రామ్ లో ఈమెను వన్ మిలియన్ కి పైగా ఫాలో అవుతున్నారు. ఇటీవల జానూ లిరి పై ఎఫైర్ రూమర్స్ సైతం వినిపించాయి. జానూ లిరి డాన్స్ ని శేఖర్ మాస్టర్ విపరీతంగా మెచ్చుకున్నారు. జానూ లిరితో శేఖర్ మాస్టర్ కి ఎఫైర్ ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి.
Also Read: ‘రెట్రో’ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఇలా అయితే బ్రేక్ ఈవెన్ అయ్యేది ఎప్పుడు?
ఈ విమర్శలపై ఇటీవల శేఖర్ మాస్టర్ స్పందించారు. ఢీ షో అనంతరం జానూ లిరి ఎవరో కూడా నాకు తెలియదు. ఆమె బాగా డాన్స్ చేసిందని మెచ్చుకున్నాను. ఆ మాత్రానికే తనతో నాకు ఎఫైర్ ఉందని ట్రోల్ చేశారు. ఆ మాటలు నన్ను ఎంతో బాధించాయి. మాకు కుటుంబాలు ఉన్నాయి అంటూ శేఖర్ మాస్టర్ ఒకింత ఆవేదన చెందారు. తాజాగా జాను లిరి ఏడుస్తూ ఓ వీడియో షేర్ చేసింది. తనను అసభ్యకరంగా ట్రోల్ చేస్తున్నారు. ఎక్కడికైనా వెళ్లి చనిపోవాలనిపిస్తుంది. నేను చనిపోతే అందుకు మీరే కారణం. నేను ఏం చేసినా తప్పుబడుతున్నారని, వీడియో సందేశం పంచుకుంది.
గతంలో రెండో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందని చెప్పిన జానూ లిరి, కాబోయేవాడిని పరిచయం చేసింది. సింగర్ దిలీప్ దేవ్ గన్ ని ఆమె వివాహమాడనుంది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ జానూ లిరి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. దిలీప్ తో దిగిన ఫోటో షేర్ చేసిన జానూ లిరి.. ఆశీర్వదించండి అని కామెంట్ పోస్ట్ చేసింది. మరోవైపు దిలీప్ సైతం స్పష్టత ఇచ్చాడు. ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నారు. ఒకరినొకరం ఇష్టపడ్డాం. వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాం, అని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు.
జానూ లిరికి గతంలో వివాహం అయ్యింది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. భర్తతో విబేధాలు నేపథ్యంలో విడిపోయింది. తన డాన్స్ స్కిల్స్ తో సోషల్ మీడియా స్టార్ గా ఎదిగింది. జానూ లిరి కాబోయే భర్తను పరిచయం చేసిన నేపథ్యంలో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
View this post on Instagram