Sumanth : అక్కినేని కుటుంబం నుండి సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, తనకంటూ ఒక ప్రత్యేకమైన ట్రేడ్ మార్క్ ని ఏర్పాటు చేసుకున్న హీరో సుమంత్(Sumanth). ఒకప్పుడు ఈయన ఇండస్ట్రీ ని షేక్ చేసే రేంజ్ సూపర్ హిట్స్ ఎన్నో అందించాడు. సత్యం, గోదావరి, గౌరీ, గోల్కొండ హై స్కూల్, మళ్ళీ రావా ఇలా ఎన్నో చిత్రాలు ఉన్నాయి. అయితే మధ్యలో ఎన్నో ఫ్లాప్స్, డిజాస్టర్ ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. ఆ కారణం చేత ఈయన పెద్ద రేంజ్ కి వెళ్లలేకపోయాడు. ప్రస్తుతం హీరో గా కంటే , ఎక్కువ క్యారక్టర్ రోల్స్ పై ద్రుష్టి పెట్టిన సుమంత్ కి మంచి పాత్రలు దక్కుతున్నాయి. సీతారామం, సార్ వంటి చిత్రాల్లో ఆయన పోషించ క్యారక్టర్స్ కి మంచి పేరొచ్చింది. ఇక ఆయన వ్యక్తిగత విషయాలకు వస్తే, అప్పట్లో ఈయన తొలిప్రేమ మూవీ హీరోయిన్ కీర్తి రెడ్డి ని ప్రేమించి పెళ్లాడిన సంగతి మన అందరికీ తెలిసిందే.
Also Read : ఈ సంక్రాంతి కి రామ్ చరణ్, బాలయ్య లతో పోటీ పడుతున్న సుమంత్…ఆయన ధైర్యం ఏంటి..?
కానీ ఈ జంట ఎక్కువ కాలం దాంపత్య జీవితాన్ని కొనసాగించలేకపోయింది. పెళ్ళైన కొన్నాళ్లకే విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. విడాకులు తీసుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ మేము స్నేహం గానే ఉన్నాం అంటూ సుమంత్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అయితే అప్పట్లో సుమంత్ రెండవ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సుమంత్, ఈ రూమర్స్ పై వెంటనే స్పందించి ఫేక్ అని తేల్చి చెప్పాడు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన పెళ్ళికి సంబంధించిన చర్చ సోషల్ మీడియా లో జోరుగా సాగుతుంది. గత కొంతకాలంగా ఆయన ఒక యంగ్ హీరోయిన్ తో ప్రేమాయణం నడుపుతున్నాడట. సుమారుగా రెండేళ్ల పాటు డేటింగ్ చేసుకుంటున్న ఈ ఇద్దరు, ఇప్పుడు పెళ్ళికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇరు కుటుంబాల మధ్య అందుకు పరస్పర అంగీకారం కూడా వచ్చిందట.
మరి ఎవరు ఆ యంగ్ హీరోయిన్?, గతంలో సుమంత్ తో కలిసి సినిమా చేసిందా లేదా? ఇత్యాది విషయాలపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. ఇకపోతే సుమంత్ సోదరి సుప్రియ కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, ఆ తర్వాత సైలెంట్ అయిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్టమొదటి చిత్రం ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ చిత్రంలో హీరోయిన్ ఈమెనే. ఆ తర్వాత ‘ఇష్టం’ మూవీ హీరో ని ప్రేమించి పెళ్లాడింది. ఆ తర్వాత విభేదాలొచ్చి అతనితో విడిపోయింది. మళ్ళీ సినిమాల వైపు చూడలేదు కానీ, అన్నపూర్ణ స్టూడియోస్ ని ఈమెనే మ్యానేజ్ చేస్తుంది. సుమంత్ కి కూడా ఇందులో భాగాలు ఉన్నాయి. ఈమె కూడా ప్రముఖ యంగ్ హీరో అడవి శేష్ తో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి కానీ నిజానిజాలు తెలియాల్సి ఉంది.
Also Read : సుమంత్ సినీ కెరియర్ ఫెయిల్ అవ్వడానికి నాగార్జుననే కారణమా..?