https://oktelugu.com/

RCB Vs CSK 2024: దూబే దంచికొడుతుంటే ధోని కసరత్తులు.. ఫన్నీ వీడియో వైరల్

న్నై జట్టు ఇంపాక్ట్ ప్లేయర్ గా శివం దుబేను తీసుకుంది. దీంతో అతడు తనమీద జట్టు ఉంచిన నమ్మకాన్ని కాపాడాడు.రచిన్ రవీంద్ర(37), రహనే (27), మిచెల్(22) వంటి కీలక బ్యాటర్లు అవుటయినప్పటికీ. జడేజా (25)తో కలిసి 66 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 23, 2024 / 03:40 PM IST

    RCB Vs CSK 2024

    Follow us on

    RCB Vs CSK 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో చెన్నై జట్టు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్లో బెంగళూరు పై ఆరుగట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 17వ సీజన్ ను చెన్నై జట్టు ఘనంగా ప్రారంభించింది. రచిన్ రవీంద్ర(37), శివం దూబే(34), రహనే (27), జడేజా (25), మిచెల్(22) సత్తా చాటడంతో బెంగళూరు విధించిన 174 పరుగుల విజయ లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో చేదించింది.

    చెన్నై జట్టు ఇంపాక్ట్ ప్లేయర్ గా శివం దుబేను తీసుకుంది. దీంతో అతడు తనమీద జట్టు ఉంచిన నమ్మకాన్ని కాపాడాడు.రచిన్ రవీంద్ర(37), రహనే (27), మిచెల్(22) వంటి కీలక బ్యాటర్లు అవుటయినప్పటికీ. జడేజా (25)తో కలిసి 66 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో చెన్నై జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంఫాక్ట్ ప్లేయర్ గా మొదట్లో మామూలుగా ఆడిన శివమ్.. ఆ తర్వాత దూకుడు పెంచాడు. బెంగళూరు బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఫోర్లు, సిక్స్ లు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మరో 8 బంతులు మిగిలి ఉండగానే చెన్నై జట్టుకు విజయాన్ని అందించాడు. ఇంఫాక్ట్ ప్లేయర్ గా తాను ఎంత ప్రత్యేకమో నిరూపించాడు.

    వాస్తవానికి మిచెల్ మార్ష్ అవుట్ అయిన తర్వాత ధోని క్రీజ్ లోకి వస్తాడని అందరూ భావించారు. కానీ ఇంపాక్ట్ ప్లేయర్ గా దూబే వచ్చాడు. మొదట్లో నిదానంగా ఆడాడు.. ఆ తర్వాత బంతిని మైదానం నలు మూలలా బాదాడు. అయితే దూబే మొదటి టి20 మ్యాచ్లో చేసిన 34 పరుగులు చెన్నై జట్టుకు చాలా విలువైనవిగా మారాయి. అతడు ఆ స్థాయిలో ఆడకుంటే చెన్నై జట్టు అంత సులభంగా విజయం సాధించేది కాదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మీమ్స్ చెలరేగుతున్నాయి. శివం దూబె దూకుడుగా బ్యాటింగ్ చేస్తుండగా.. మహేంద్ర సింగ్ ధోని డ్రెస్ రూమ్ లో కసరతులు చేస్తున్నట్టు రూపొందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. రవితేజ ఓ సినిమాలో విలన్లను విపరీతంగా కొడుతుంటాడు. శివం దూబె కూడా అలానే నిన్న బెంగళూరు బౌలర్లను బాదాడని.. అదే సమయంలో ఎమ్మెస్ నారాయణ అనే కమెడియన్ శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా కసరత్తులు చేస్తుంటాడు. దూబె దూకుడుగా ఆడుతుంటే డ్రెస్సింగ్ రూమ్ లో ధోని కూడా అలానే చేశాడని ఓ నెటిజన్ వీడియో రూపొందించాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది. ఇప్పటికే ఇది లక్షల్లో వ్యూస్ నమోదు చేసింది.