https://oktelugu.com/

Somireddy: సోమిరెడ్డికి ఛాన్స్ ఇస్తూనే ఉన్న చంద్రబాబు

గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసిపి క్లీన్ స్వీప్ చేసింది. అన్ని నియోజకవర్గాలను కైవసం చేసుకుంది. సిట్టింగ్ మంత్రిగా ఉంటూ సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఓటమి ఎదురైంది.

Written By:
  • Dharma
  • , Updated On : March 23, 2024 3:31 pm
    Somireddy

    Somireddy

    Follow us on

    Somireddy: గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తున్నట్లు చంద్రబాబు చెబుతున్నారు. సర్వేల్లో అనుకూలంగా వస్తేనే టిక్కెట్లు ఇచ్చినట్లు చెప్పుకొస్తున్నారు. వరుసగా రెండుసార్లు ఓడిపోయిన వారికి పక్కన పెడుతున్నట్లు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు.అయితే నెల్లూరు నుంచి టికెట్ తగ్గించుకున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విషయంలో మాత్రం చాలా రకాలుగా మినహాయింపులు ఇచ్చారు.ఆయన విషయంలో నిబంధనలను పక్కన పెట్టారు. సర్వేపల్లి నియోజకవర్గ టిడిపి టికెట్ ను కట్టబెట్టారు.అయితే సోమిరెడ్డి విషయంలో విధేయత, టిడిపిలోనే కొనసాగడం వంటి విషయాలను పరిగణలోకి తీసుకున్నారు.

    గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసిపి క్లీన్ స్వీప్ చేసింది. అన్ని నియోజకవర్గాలను కైవసం చేసుకుంది. సిట్టింగ్ మంత్రిగా ఉంటూ సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఓటమి ఎదురైంది. అయితే ఆ నియోజకవర్గంలో సోమిరెడ్డికి ఓటమి కొత్త కాదు. 2004 నుంచి జరిగిన ప్రతి ఎన్నికలోనూ సోమిరెడ్డి ఓడిపోతూనే ఉన్నారు. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో సిట్టింగ్ మంత్రిగా ఉంటూ పోటీ చేసిన సోమిరెడ్డి ఓడిపోయారు. 2009లో సైతం ఓటమే పలకరించింది. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో సోమిరెడ్డి కొట్టుకుపోయారు. వరుసగా ఐదు సార్లు ఓటమి చవి చూసినా చంద్రబాబు మాత్రం సోమిరెడ్డి పై నమ్మకం పెట్టారు. సర్వేపల్లి టిక్కెట్ ను కేటాయించారు.మూడో జాబితాలో ఆయన పేరును ప్రకటించారు.

    2014లో సోమిరెడ్డి ఓడిపోయినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో చంద్రబాబు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. ఆయన సీనియారిటీ, సిన్సియారిటీని పరిగణలోకి తీసుకొని మంత్రి పదవి ఇచ్చారు. అయినా సరే సర్వేపల్లి నియోజకవర్గం లో తన పట్టును నిరూపించుకోలేకపోయారు. 1994, 1999 ఎన్నికల్లోమాత్రం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుపొందారు. చంద్రబాబు మంత్రివర్గంలో క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా, సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో ఎమ్మెల్సీగా చేసి మరి తన మంత్రివర్గంలోకి చంద్రబాబు తీసుకున్నారు. వరుసగా ఐదుసార్లు ఓడిపోయినా చంద్రబాబు మాత్రం సోమిరెడ్డికి ఛాన్స్ ఇస్తూనే ఉన్నారు. పార్టీకి నెల్లూరు జిల్లాలో పెద్దదిక్కుగా ఉండడం, విధేయత చూపడమే సోమిరెడ్డికి ఆ తరహాలో ఛాన్స్ ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది.