Dhoni
Dhoni : తమిళంలో రాక్షసన్ సినిమా ద్వారా విష్ణు విశాల్ అందరికీ సుపరిచితమైపోయాడు. ఆ సినిమాలో రామ్ అనే పోలీస్ అధికారిగా నటించిన అతడు.. విమర్శకుల ప్రశంసలు పొందాడు. ఆ సినిమాలో కేసును డీల్ చేసే పోలీస్ ఆఫీసర్ గా నటించి అందరినీ మెప్పించాడు. అయితే ఆ సినిమా ద్వారా ఫేమస్ అయిన విష్ణు విశాల్.. ఇప్పుడు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. తాజాగా మమత బైజు తో జంటగా రాక్షసన్ సినిమా దర్శకుడు రామ్ కుమార్ డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. అది షూటింగ్ పూర్తి చేసుకుంది. జూన్ లేదా జూలై నెలలో విడుదల కానుంది. ఇక విష్ణు విశాల్ ఏ విషయాన్ని అయినా సరే కుండబద్దలు కొట్టినట్టు చెబుతాడు. తాజాగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓడిపోవడాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. ఆగ్రహాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేశాడు. అతడు వ్యక్తం చేసిన అభిప్రాయానికి చెన్నై అభిమానులు మద్దతు పలుకుతున్నారు. నిజంగానే ఇలా జరిగి ఉండకూడదని వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : ధోని నాటౌటా? అలా అయితే పెవిలియన్ ఎందుకు వెళ్లినట్టు?
ధోనిపై అసహనం
విష్ణు విశాల్ చేసిన సోషల్ మీడియా పోస్టులో నేరుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోనిని విమర్శించకపోయినప్పటికీ.. పరోక్షంగా ధోనిని ఉద్దేశించి విష్ణు విశాల్ వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తోంది..” లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ కు కావలసిన అవసరమేముంది.. చూస్తుంటే ఇదంతా ఒకసారికసులాగా కనిపిస్తోంది. ఆటకంటే ఎవరూ గొప్ప కాదు. అసలు ఇలా ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదు. కేవలం ఇలా జరగడానికి మాత్రమే క్రికెట్ ఆడుతున్నారా.. అలాంటప్పుడు ఇదంతా ఎందుకని” విష్ణు విశాల్ తను సోషల్ మీడియాలో చేసిన పోస్టులో ప్రస్తావించాడు. అయితే అతడు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కు విపరీతమైన స్పందన లభిస్తోంది.. చెన్నై అభిమానులు.. ఐపీఎల్ అభిమానులు విష్ణు విశాల్ కు మద్దతు తెలుపుతున్నారు..” నిజమే మీరన్నది. ఈ సీజన్ ప్రారంభం నుంచి అలానే జరుగుతోంది. అసలు అలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. అంతిమంగా చెన్నై జట్టు మాత్రం విఫలజట్టుగా ముద్ర పడిపోతోంది. నిజంగా ఇలా జరగడం దేనికి మంచిదో అర్థం కావడం లేదని” చెన్నై అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 9 వికెట్లు లాస్ అయ్యి 103 రన్స్ స్కోర్ మాత్రమే చేసింది. ఆ తర్వాత ఆ లక్ష్యాన్ని కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరో 59 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని పూర్తిచేసింది. ఇక ఈ మ్యాచ్లో ధోని 9వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. నాలుగు బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం ఒకే ఒక్క పరుగు మాత్రమే చేశాడు.
Also Read : ఫస్ట్ అన్ క్వాప్డ్ కెప్టెన్ ధోని.. ఇంకా ఎన్నో ఘనతలు..
I refrained n refrained n refrained being a cricketer myself…
I didn wanna come to conclusions too soon…But this is atrocious…
Why come so lower down the order ..
Is any sport played not to win?
Its just like visitn a circus now…
NO INDIVIDUAL IS BIGGER THAN THE…
— VISHNU VISHAL – VV (@TheVishnuVishal) April 11, 2025
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Dhoni retire circus tamil hero fires
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com