Dhoni : చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ కొనసాగుతున్న సమయంలో సునీల్ నరైన్ బౌలింగ్లో మహేంద్ర సింగ్ ధోని వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ క్రమంలో అవుట్ కోసం సునీల్ నరైన్ అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు. అయితే ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ రివ్యూ కోరాడు.. అయితే థర్డ్ అంపైర్ రివ్యూలో బంతి గమనాన్ని.. ధోనికి ప్యాడ్ లకు తగిలిన విధానాన్ని పరిశీలించి ఔట్ గా ప్రకటించాడు.. అయితే రిప్లై లో మాత్రం బంతి బ్యాటు పక్కనుంచి వెళ్తున్నట్టు కనిపించింది. అల్ట్రా ఎడ్జ్ లో కాస్త హెచ్చుతగ్గులను చూపించింది. దీంతో అది క్లియర్ ఎడ్జ్ అయిందని.. అందువల్ల ధోని నాటౌట్ అని పలువురు అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : ఫస్ట్ అన్ క్వాప్డ్ కెప్టెన్ ధోని.. ఇంకా ఎన్నో ఘనతలు..
ఒక్క పరుగు మాత్రమే..
ఈ మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోని ఒకే ఒక్క పరుగు చేశాడు.. పైగా ఈ సీజన్లో ధోని ధాటిగా ఆడుతున్నప్పటికీ.. చివరి దశలో బ్యాటింగ్ కు వచ్చాడు. దీంతో చెన్నై జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది. ధోని మైదానంలోకి వచ్చినప్పటికీ భారీగా పరుగులు చేయలేకపోయాడు. ఉన్నంతసేపు ఇబ్బంది పడుతూ కనిపించాడు. మరోవైపు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు బౌలర్లు నిప్పులు కురిపించారు. సహకరిస్తున్న చెన్నై మైదానంపై అద్భుతాలు చేశారు. ఒకానొక దశలో చెన్నై జట్టు 100 పరుగులు కూడా చేసేది అనుమానంగానే కనిపించింది. అయితే శివం దుబే చివర్లో కాస్త ఆకట్టుకోవడంతో ఆమాత్రమైనా స్కోర్ చేయగలిగింది. లేకుంటే వందలోపే కుప్పకూలేది. అదే జరిగితే చెన్నై అత్యంత తక్కువ స్కోరు చేసిన జట్టుగా మిగిలి పోయేది.. ఇక ఈ మ్యాచ్లో సునీల్ నరైన్ మూడు వికెట్లు పడగొట్టాడు. రాహుల్ త్రిపాఠి (18), రవిచంద్రన్ అశ్విన్ (1), ధోని (1) ని సునీల్ నరైన్ అవుట్ చేశాడు. ఇక ఈ మ్యాచ్లో చెన్నై జట్టు 9 వికెట్ల కోల్పోయి 103 పరుగులు మాత్రమే చేసింది. అసలు సొంత నగరంలో ఇంత దారుణంగా ఆడుతున్న జట్టును చూసి చెన్నై అభిమానులు ఒక్కసారిగా నిర్గాంత పోయారు.. చివరికి ధోని కూడా ఒక పరుగు చేసి అవుట్ కావడం విశేషం. తొమ్మిది వికెట్లకు 103 పరుగులు చేసిన చెన్నై జట్టు అత్యంత దారుణమైన రికార్డులను తన పేరు మీద నమోదు చేసుకోవడం విశేషం.. 2008లో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో 109 పరుగులకే చెన్నై జట్టు ఆల్ అవుట్ అయింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై జట్టుకు ఇదే అత్యల్ప స్కోర్ గా ఉంది. అయితే శుక్రవారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో 103 పరుగులు చేయడం ద్వారా ఐపీఎల్ లో అత్యంత తక్కువ స్కోరు చేసిన చెత్త రికార్డును నమోదు చేసింది.
Also Read : ఎంఎస్ ధోని పోరాటసింహం.. ఓరయ్యా ఏం తాగి ఎడిట్ చేశార్రా?