టీమిండియా మాజీ కెప్టెన్.. చెన్నై సూపర్ కింగ్స్ రథసారధి మహేంద్ర సింగ్ ధోనీ మరో రికార్డుకు చేరువయ్యారు. వచ్చే ఐపీఎల్‌లో ధోనీ బరిలో దిగితే పొట్టి లీగ్‌లో అత్యధికంగా రూ.150 కోట్లు వేతనం తీసుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు. ఐపీఎల్‌లో మొత్తం 13 సీజన్‌లు కలుపుకుని అత్యధికంగా రూ.137 కోట్లు వేతనంగా తీసుకున్నాడు ధోనీ.
Also Read: ఆస్ట్రేలియాతో 4వ టెస్ట్.. రద్దుయేనా?
2008లో ఏడాదికి రూ.6 కోట్ల చొప్పున మూడేళ్లకు రూ.18 కోట్లకు ధోనీని చెన్నై కొనుక్కుంది. వేతనం సడలింపులో భాగంగా ధోనీ జీతం రూ.8.28 కోట్లకు పెరిగింది. ఈ ఒప్పందం మూడేళ్లు కొనసాగింది. 2014,2015లలో ధోనీ ఏడాదికి రూ.12.5 కోట్లు సంపాదించాడు. రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ తరఫున రెండేళ్లు ఆడిన ధోనీకి రూ.25కోట్లు లభించాయి.
ఇక 2018లో మరోసారి చెన్నై పగ్గాలు చేపట్టిన ధోనీ ఏడాదికి రూ.15 కోట్ల చొప్పున మూడేళ్లలో రూ.45 కోట్లు సంపాదించాడు. 2021 సీజన్‌లోనూ ధోనీకి రూ.15 కోట్లు లభిస్తాయి. దీంతో ఐపీఎల్‌లో మొత్తం రూ.150 కోట్లు వేతనంగా తీసుకున్న ఆటగాడిగా నిలుస్తాడు.
Also Read: స్మిత్ సెంచరీ.. పటిష్ట స్థితిలో ఆస్ట్రేలియా.. ఇండియా నిలబడుతుందా?
మరోవైపు.. అవార్డులు, రివార్డులు అన్నీ లెక్కిస్తే ధోనీ ఆదాయం రూ.200 కోట్లు దాటొచ్చని అంచనా. ఇక ఇప్పటివరకు రూ.131 కోట్లతో రోహిత్ శర్మ ద్వితీయ, రూ.126 కోట్లతో విరాట్ కోహ్లి తృతీయ స్థానాల్లో ఉన్నారు. వచ్చే సీజన్‌లో రోహిత్‌కు ముంబయి ఇండియన్స్ రూ.15 కోట్లు ఇస్తుంది. రూ.146 కోట్లతో రోహిత్ రెండో స్థానంలో కొనసాగుతాడు. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కోహ్లీకి రూ.17 కోట్లు ఇస్తుంది. రూ.143 కోట్లతో కోహ్లీ మూడో స్థానంలో నిలుస్తాడు. 2021 ఐపీఎల్‌లో బరిలో దిగితే సురేష్ రైనా, డివిలయర్స్‌లు రూ.100 కోట్ల మైలురాయిని అధిగమిస్తారు.