కరోనా బాధితులకు షాకింగ్ న్యూస్.. 8 నెలలు శరీరంలో వైరస్..?

కరోనా మహమ్మారి గురించి శాస్త్రవేత్తలు అధ్యయనం చేసే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడి 14 రోజుల పాటు తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ నుంచి కోలుకుంటామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శరీరంలోని యాంటీబాడీలు మళ్లీ కరోనా బారిన పడకుండా రక్షిస్తాయని చాలామంది భావిస్తున్నారు. అయితే శాస్త్రవేత్తలు తాజాగా కరోనా గురించి మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. Also Read: కరోనా వ్యాక్సిన్‌పై ఆసక్తి చూపని ఇండియన్స్‌ వైరస్ నుంచి కోలుకున్న […]

Written By: Kusuma Aggunna, Updated On : January 9, 2021 4:12 pm
Follow us on

కరోనా మహమ్మారి గురించి శాస్త్రవేత్తలు అధ్యయనం చేసే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడి 14 రోజుల పాటు తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ నుంచి కోలుకుంటామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శరీరంలోని యాంటీబాడీలు మళ్లీ కరోనా బారిన పడకుండా రక్షిస్తాయని చాలామంది భావిస్తున్నారు. అయితే శాస్త్రవేత్తలు తాజాగా కరోనా గురించి మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.

Also Read: కరోనా వ్యాక్సిన్‌పై ఆసక్తి చూపని ఇండియన్స్

వైరస్ నుంచి కోలుకున్న తరువాత దాదాపు 8 నెలల పాటు శరీరంలో కరోనా వైరస్ ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక అధ్యయనం ప్రకారం కరోనా నుంచి కోలుకున్న వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. సాధారణంగా కరోనా బారిన పడిన వారిలో ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. అయితే శాస్త్రవేత్తలు కరోనా నుంచి కోలుకున్న వారిలో సైతం ఇమ్యూనిటీ పవర్ తక్కువగానే ఉంటుందని చెబుతున్నారు.

Also Read: వాళ్లు రాజీకి వచ్చారు..! : ఇక ప్రపంచ వ్యాప్తంగా ఆ వ్యాక్సిన్లు

అమెరికాకు చెందిన అల్లెసాండ్రో సెట్టె ఆఫ్‌ లా జొల్ల ఇన్‌స్టిట్యూట్ కరోనా మహమ్మారికి సంబంధించి ఈ విషయాలను వెల్లడించింది. మొత్తం 188 మంది కరోనా బాధితుల రక్త నమూనాలు సేకరించి పరిశోధనల ఫలితాల ఆధారంగా ఈ విషయాలను పేర్కొంది. శరీరంలో ఉన్న కరోనా వైరస్ బి, సి సెల్స్ ను నశింపజేయడంతో పాటు యాంటీ బాడీస్ ను చంపేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం

కరోనా నుంచి కోలుకున్నా కొంతమందిలో రీ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని.. కరోనా నుంచి కోలుకున్న రెండు నెలల్లో ఈ విధంగా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారికి మళ్లీ వైరస్ సోకే అవకాశం ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు.